Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సీరియల్స్ క్రేజ్ ఏ విధంగా మారిపోయిందో మనందరం చూస్తూనే ఉన్నాం. సంవత్సరానికి 1 2 సార్లు కనిపించే హీరోయిన్స్ కంటే రోజు టీవీ సీరియల్స్ లో కనిపించే ముద్దుగుమ్మలనే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే వారు కూడా తమ అందచందాలను ఆరబోస్తూ భారీ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఒకప్పుడు సీరియల్స్ అంటే చాలా చీప్ గా చూసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి సినిమాలకి పట్టింది. ప్రేక్షకులు అంత టీవీ సీరియల్స్ కి అలవాటయిపోయి కాన్సెప్ట్ ఎంత బాగున్నప్పటికీ థియేటర్స్ కి వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇందువల్లే హీరోయిన్స్ అవ్వాలి అనుకున్న వారు కూడా సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
ఇక అలా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపుని సంపాదించుకున్న వారు ఎందరో ఉన్నారు. వారిలో సంధ్యారాగం సీరియల్ ఫేమ్ ఆధ్యా కూడా ఒకరు. తాజాగా జీ తెలుగులో ప్రసారమవుతున్న సరికొత్త ధారావాహిక పడమటి సంధ్యారాగం. ఈ సీరియల్ ని మొదట్లో మహేష్ బాబు ప్రమోట్ చేయడంతో భారీ హైప్స్ ఏర్పడ్డాయి. అదేవిధంగా ఈ సీరియల్ కాన్సెప్ట్ కూడా బాగుండడంతో ప్రతి ఒక్కరూ అట్రాక్ట్ అయ్యారు. ఈ సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ టాప్ టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతుంది. పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ ఆధ్యా అసలు పేరు ప్రీతి శర్మ.
ఈ ముద్దుగుమ్మ ఆద్య క్యారెక్టర్ లో ఒరిగిపోతూ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఇక ఈమె పిన్ని 2 వంటి సీరియల్స్ తో ప్రేక్షకులకు పరిచయం విపరీతమైన ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. కానీ ఈమెకి స్టార్ పాపులారిటీ తెచ్చి పెట్టింది మాత్రం పడమటి సంధ్యారాగం సీరియల్ అనే చెప్పుకోవచ్చు. అతి తక్కువ సమయంలోనే ఆధ్యా క్యారెక్టర్ లో ఫుల్ గా ఒదిగిపోయి తన యాక్టింగ్‌ను ప్రదర్శించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుత కాలంలో సీరియల్స్ మరియు సినిమాల్లో నటించే నటీనటులు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ప్రీతి శర్మ సైతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
ఇక ప్రీతి తన పర్సనల్ అండ్ ఫ్యామిలీ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. అయితే రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తుంది. ఆ ఫొటోస్ లో ప్రీతి శర్మ చాలా అల్లరిగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది. ఈ ఫొటోస్ ని చూసిన వారంతా..” నిజంగా మీరు లవ్లీ ఏంజెల్. మిమ్మల్ని చూస్తుంటే దేవతలాగా కనిపిస్తున్నారు. మీ గ్లామర్ వెండి తెరది. కానీ అనుకొని పరిస్థితుల్లో బుల్లితెరకి పరిచయం అవ్వాల్సి వచ్చింది. అయినా ఏ మాటకి ఆ మాట మీ ముందు అతిలోక సౌందర్య కూడా అసూయ పడుతుంది. మీ గ్లామర్ దోస్ ని ఇలానే పెంచుతూ రానున్న రోజుల్లో మీరు కూడా స్టార్ హీరోయిన్గా ఎదగండి. ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.