NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ బిగ్ స్టోరీ

రైతు దెబ్బకు ఢిల్లీ పీఠాలు కదులుతున్నాయి : దేశ రాజధానిలో టెన్షన్

దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది… కనీసం ఢిల్లీ లోపలకు వెళ్లి దారులన్నీ మూసుకు పోయాయ్.. ఢిల్లీ లోని పోలీసులంతా శివారు ప్రాంతాల్లో కాపలాదారులు గా మారిపోయారు.. వేలాది మంది రైతులు పిల్ల జల్లా… కుటుంబాలతో సహా దేశ రాజధాని వైపు దూసుకొస్తున్నారు. వారిని ఎలా నిలువరించాలో ఢిల్లీ ప్రభుత్వానికి అర్థంకాని పరిస్థితి. వారిని అరెస్టు చేసి లోపల వేస్తే కనీసం జైలు కూడా సరిపోని దుస్థితిలో 4 ప్రభుత్వ స్టేడియం లను జైలు గా మార్చాలని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. ఇది ఎంతటి తీవ్రమైన ఆందోళన అంటే… ఆందోళనకారులు ఏకంగా నిత్యావసర సరుకులను తమ వెంట తెచ్చుకున్న కొన్ని నెలలపాటు ఆందోళన చేయడానికి సిద్ధమై రావడం కనిపిస్తోంది. ఇదేమీ ఒకరోజు ఆందోళన కాదు… గత వారం రోజులుగా పాదయాత్ర ద్వారా రైతులు దేశ రాజధానికి పయనమైన సంఘటన. దేశ రాజధానిలో ఇంత జరుగుతున్నా ఇదంతా తెలుగు మీడియాకు కనిపించదు వినిపించదు. వాళ్లకు కావాల్సింది అన్నదాతలు ఆక్రోశం కాదు.. కేవలం టీఆర్పీ ఆరాటమే. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ అల్లర్లు ఏమిటి..? ఎందుకీ అన్నదాతలు ఆక్రోశం ఒక్కసారి గమనిద్దాం రండి..

బిజెపి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నూతన వ్యవసాయ విధానం 2020 బిల్లును వ్యతిరేకిస్తూ హర్యానా పంజాబ్ రైతులు మొదటి నుంచి నిరసనల బాట పట్టారు. బిల్లులు ఆమోదించిన అనంతరమే ఈ రెండు రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు మొదలయ్యాయి. అవి క్రమక్రమంగా తీవ్రరూపం దాల్చాయి. బందులు రాస్తారోకోలు నిరాహార దీక్షలు దాటి తమ నిరసన గళాన్ని దేశరాజధానిలో వినిపించేందుకు పంజాబ్ హర్యానా రైతులు సంయుక్తంగా కార్యాచరణను రూపొందించుకున్నారు.

ఎందుకీ నిరసన??

నూతన వ్యవసాయ విధానం 20 20 బిల్లును రాజ్యసభలో మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు. దీనిలో ప్రధానంగా రైతు పండించిన పంటను రైతు తనకు ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన వారికి అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. రైతులు ఒక సంఘంగా ఏర్పడి వారు ఒక పంటను పండించి వారు చెప్పిన ప్రకారమే మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఎంతకాలమైనా నిల్వ ఉంచుకోవచ్చు. స్థానిక మార్కెట్ యార్డుకు వెళ్లకుండా తమ ఇష్టప్రకారం ఇండియాలో ఎక్కడైనా తమ పంటను అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. అయితే పంజాబ్ హర్యానాల్లో ఎక్కువగా పండించే గోధుమలు పంటకు ప్రభుత్వం ఇపుడు మద్దతుదారుగా 2200 రూపాయలను అందిస్తోంది. ఇది అక్కడి రైతులకు లాభదాయకమే. కొత్త విధానం వల్ల ప్రభుత్వం మద్దతు ధర విషయంలో పక్కకు తప్పుకునే అవకాశం ఉంటుందని, ప్రైవేటు వ్యాపారులంతా సిండికేట్ అయ్యి ఇస్తాను సార్ ధరను నిర్ణయించే అవకాశం ఉంటుందని ప్రభుత్వ అజమాయిషీ లేకపోతే తమ దిక్కు ఎవరంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. హర్యానా పంజాబ్ రైతుల్లో ఈ ఆందోళన ఆక్రోశం క్రమక్రమంగా పెరిగాయి.

ఢిల్లీ కోసం వేలాదిగా…

ఢిల్లీ ఆందోళన బాట పట్టేందుకు పంజాబ్ హర్యానా కు చెందిన సుమారు 80 వేల రైతు కుటుంబాలు ఓ తాటి పైకి వచ్చాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఆందోళన చేసినా ఫలితం లేకపోవడంతో దేశరాజధానిలో తేల్చుకుందామని రైతు నాయకులు ఓ ప్రణాళిక వేశారు. ఢిల్లీకి నలువైపుల నుంచి వచ్చే రహదారుల్లో రైతులు లోపలకు వచ్చేలా గ్రూపులుగా విభజించి ఆందోళన బాట పట్టారు. దీంతో ఇప్పుడు ఢిల్లీ పోలీసులకు వీరిని నిలువరించడం కత్తిమీద సాములా తయారైంది. అన్ని వైపుల నుంచి రైతులు భారీగా ఢిల్లీలో పాలకు తరలివస్తున్న డంతో వారిని ఆపడం పోలీసుల వల్ల కావడం లేదు. వారం రోజుల నుంచి పాదయాత్ర ద్వారా ఢిల్లీ శివార్ల వరకు వచ్చిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ ఆపుతున్నారు. బాష్పవాయు ప్రయోగాలు వాటర్ క్యాన్లు వంటివి ప్రయోగిస్తున్నారు. బారికేడ్లను తన్నుకుంటూ దాటుకుంటూ రైతులు కదనరంగంలో సైనికుల్లా ఢిల్లీ లోకి రావడం ఇప్పుడు ఢిల్లీ పెద్దలను టెన్షన్ పెట్టిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి దేశ రాజధానిలో నెలకొంది. వేలాదిగా వస్తున్న రైతులు వారి కుటుంబాలను అదుపు చేసేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నిస్తున్నా, ఇంకా అదుపు లేకుండా వస్తున్న రైతులను అడ్డుకోవడం కోసం జైలు సరిపోక ఏడు మైదానాలను సిద్ధం చేయాలని ఢిల్లీ ప్రభుత్వం తాజాగా కోరడం ఆందోళన యొక్క తీవ్రతను తెలియజేస్తోంది.

ఢిల్లీలో హై అలెర్ట్

వేలాదిగా తరలివస్తున్న రైతుల ఆందోళనతో ఢిల్లీ ప్రభుత్వం ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడింది. అన్ని వైపుల నుంచి రైతులు తరలివస్తున్న దాంతో వారిని నిలువరించడం సాధ్యం కావడం లేదు. ఢిల్లీలో ఉన్న పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలు సైతం రంగంలోకి దింపారు. ఢిల్లీ ప్రధాన మార్గమైన యమునా ఎక్స్ప్రెస్ హైవే పూర్తి దిగ్బంధం అయింది. ఆందోళనకారులను చెదరగొట్టారు ఒక్కొక్కరుగా పంపేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. పలుచోట్ల టియర్ గ్యాస్ ను, చాలా ఫిరంగులను ప్రయోగించాయి. ఎన్నో చోట్ల లాఠీచార్జిలు అయ్యాయి. అయినా రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకొస్తున్న డంతో ఎక్కడికక్కడ బారికేడ్లను పెట్టారు. ఢిల్లీ లో హై అలర్ట్ ప్రకటించి, ప్రజలు సైతం ఏదైనా అవసరం ఉంటేనే బయటకు రావాలని కోరుతున్నారు. మెట్రో రైళ్లను పలుచోట్ల రద్దు చేశారు. రైతులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్న ఇంకా వారు గుంపులుగుంపులుగా వస్తుండడంతో ముందు జాగ్రత్తగా పలు మైదానాలను జైలు గా మార్చేందుకు రంగం సిద్ధం చేసి ప్రభుత్వ అనుమతి కోరారు. ఢిల్లీలో ఎప్పుడు ఏమవుతుందో అన్న టెన్షన్ ఇటు సర్కారును అటు ప్రజల్లో నెలకొంది.

తెలుగు మీడియా కి ఎందుకు పట్టదు?

రైతుల ఆందోళనలు కవర్ చేయడంలో తెలుగు మీడియా ఎప్పుడు పక్షపాతం చూపిస్తోంది. గతంలో మహారాష్ట్రలో వేల కిలోమీటర్లు నడిచి రైతులు వేలాదిగా ముంబై నడివీధుల్లో కవాతు చేసిన దాన్ని తెలుగు మీడియా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా అచ్చం అలాగే రైతులు వేలాది సంఖ్యలో తమ కుటుంబాలతో సహా నెల రోజులకు సరిపడా నిత్యావసరాలు వెంటబెట్టుకుని మరి ఆందోళన బాట పట్టిన తెలుగు మీడియా కవర్ చేయడంలో వెనక బడుతుంది. వారంరోజులుగా హర్యానా పంజాబ్ రాష్ట్రాల రైతుల నిరసనలు కవాతులు జరుగుతున్న తెలుగు మీడియం అభివృద్ధి సాధించిన దాఖలాలు లేవు. కనీసం స్పాట్గా కవర్ చేసిన అంశాలు పేపర్లో, టీవీల్లో తెలుగు ప్రజలకు రాని దుస్థితి నెలకొంది. కేవలం ఎన్టీఆర్ పిల్ల కోసం వెకిలి వార్తలను వండి వడ్డించే తెలుగు మీడియా రైతుల ఆక్రోశాలు, ఆర్తనాదాలు కనీసం పట్టించుకోవడం తెలుగు ప్రజలకు శాపమే.

author avatar
Special Bureau

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju