NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

“అన్న”మాట జగనన్నకి వినిపించిందా…??

 

నక్సలిజం.. నక్సలైట్లు వ్యవస్థతో ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి పోరాడుతున్నాయి. ఒక నక్సలైట్ తాను మారి జన జీవన స్రవంతిలో కలిసి పోతామంటే ప్రభుత్వం, పోలీసులు ఎంతో సంబర పడతాయి. వారి జీవితానికి సరిపడా సంతోషాన్ని ప్రసాదిస్తాయి. అటువంటి దశలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే నక్సలిజం దారికి వస్తున్న దశలో ఒ వ్యక్తి ఏకంగా నేను నక్సలైట్ గా మారిపోతాను అవకాశం ఇవ్వండి అని రాష్ట్రపతికి లేఖ రాయడం సంచలనమే. ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థలు ఆలోచించాల్సిన విషయమే. దీని వెనక రాజకీయ కోణాన్ని కుల మత వర్గ కోణాన్ని పక్కనపెడితే వ్యక్తిగా అతను అలా ఎందుకు అనాల్సి వచ్చింది? దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? అన్నగా మారడమే పరిష్కారమా? అనేది ఆలోచించాల్సి ఉంది. రాజకీయ దృష్టితో చూసి ఉంటే అటువంటి ఆలోచనను పక్కన పెట్టి అతని బాధ్యతను తీసుకొని మనిషిగా ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ పైన ఉంది. అసలు ఈ మాట సీఎం జగన్ కు వినిపించిందా? లేదా? తన రాష్ట్రంలో ఓ అల్ప వర్గానికి చెందిన వ్యక్తి నేను నక్సలైట్ గా మారతాను అనుమతి ఇవ్వండి అంటూ రాష్ట్రపతి కి లేఖ రాయడం వెనుక ఏం జరుగుతుంది అనేది జగన్ పసిగట్టారా? లేదా? అనేదే ఇప్పుడు కీలకం.

naxalites file photo

 

అన్న బాటలోకి వెళ్లడమే పరిష్కారమా?

కాలం మారుతున్నా, వారిలో సిద్ధాంతాలు మారుతున్నా, నక్సలైట్ లను తుదముట్టించేసాం అని పాలకులు, పోలీసులు ప్రకటించుకుంటున్నా ఇంకా ప్రజలకు అన్యాయం జరిగిన ప్రతి సారి అటు వైపు చూస్తున్నారు అంటే చట్ట సమాజంలో దొరకని న్యాయం అక్కడ లభిస్తుంది అన్న నమ్మకం ఇంకా ప్రజలలో ఉండి అనుకోవాలా? అందుకే శిరోముండనం బాధితుడు ప్రసాద్ ఈ విధంగా రాష్ట్రపతికి లేఖ రాశాడా? నిత్యం అనేక రకాల విజ్ఞప్తులు రాష్ట్రపతికి వెళుతున్నా ఈ విషయంలో అయన వెంటనే స్పందించారు అంటే..బాధితుడు ఎంత కలత చెందాడు అన్న విషయం లేఖ ద్వారా స్పష్టం కావడమే. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే..ఒక లేఖకు రాష్ట్రపతి వెంటనే స్పందించి ప్రస్తుత ప్రజాస్వామ్య దేశంలో బాధితులకు ఏదోఒక స్టేజిలో న్యాయం జరుగుతుంది అన్న నమ్మకాన్ని కల్గించారు.

దీనిపై సీఎం జగన్, పోలీస్ వ్యవస్థ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. రాష్ట్రపతి నియమించిన అధికారి విచారణ పూర్తి అయిన తరువాత ఎటువంటి పరిష్కారం లభిస్తుంది అన్న దానిపై రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju