NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

ACB : ఏకంగా బెజవాడ దుర్గమ్మ సన్నిధి లోనే ఇంత దోచేశారా?

ACB :  విజయవాడకి కేంద్రబిందువైన… ఎంతో పేరు మోసిన బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఒకరు కాదు… ఇద్దరు కాదు ఏకంగా 16 మంది ఆలయ సిబ్బందిని సస్పెండ్ చేయడం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో అందరినీ విస్మయానికి గురిచేసింది. రాజధాని అమరావతి పరిధిలో జగన్ నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరిగిన అవినీతి అక్రమాలు వెలుగుచూశాయి.

 

ACB rides in Vijayawada Temple
ACB rides in Vijayawada Temple

రాష్ట్రంలో ఎంతో మందికి దుర్గమ్మ దేవస్థానం అంటే కల్పతరువు లెక్క. అయితే దోచుకున్నోడికి దోచుకున్నంత అన్నట్లు ఇక్కడ పరిస్థితి తయారయింది. చంద్రబాబు హయాంలో బెజవాడ దుర్గమ్మ దేవస్థానం మొట్టమొదటిసారి వివాదాల్లోకి ఎక్కింది. అప్పట్లోనే ఏకంగా గుడిలో తాంత్రిక పూజలు చేశారు అన్న విమర్శలతో పాటు ఎంతో అవినీతి జరుగుతోందనే ఆరోపణలు వచ్చాయి.

అయితే ఇప్పుడు మరొకసారి బెజవాడ దుర్గమ్మ దేవస్థానంలో సిబ్బందిలో ఒక్కసారిగా 16 మంది సిబ్బంది పై వేటు పడింది. అయితే ఇప్పుడు కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. నిజానికి వేటు వేయాల్సింది సిబ్బంది మీద కాదు ఈవో పైన అంటూ చెబుతున్నారు. అలాగే ఇంతటి అవినీతి జరుగుతుంటే దేవాదాయశాఖ మంత్రి కూడా బాధ్యత వహించాలి అని మరికొందరి డిమాండ్ చేస్తున్నారు. ఈ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఈవో కి తెలియకుండా ఉంటుందా…? కేవలం కిందిస్థాయి సిబ్బందిపై వేటు చేసి చేతులు దులుపుకుంటున్నారు వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

మూడు రోజుల పాతు జరిగిన ఏసిబి విచారణలో ఇంద్రకీలాద్రి పై నెలకొన్న కనక దుర్గమ్మ సన్నిధిలో అవినీతి రాజ్యమేలుతోంది అన్న విషయాలు బయటకు వచ్చాయి. మూడు రోజుల పాటు సోదాలు జరిపిన ఏసిబి వారి దాడుల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. శానిటేషన్ కాంట్రాక్టులు, సెక్యూరిటీ సిబ్బంది టెండర్లు. స్టోర్ లో సరుకులు, అమ్మవారి చీరల అమ్మకాలు మొదలుపెట్టి ప్రతి ఒక్క దానిలో కూడా అవినీతి చోటు చేసుకున్నట్లు ఏసీబీ తేల్చింది.

దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలను కూడా ఈవో సురేష్ బాబు పట్టించుకోలేదన్న విమర్శలు కూడా ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా టెండర్లు, కొనుగోళ్ళు వంటి కీలక అంశాల్లో అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈవో సురేష్ బాబు ఈ ఏసిబి దాడి పై నివేదికను ప్రభుత్వానికి పంపారు.

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju