తెలుగు బుల్లితెర లో జబర్దస్త్ లాంటి కామెడీ షో లో క్రేజ్ సంపాదించుకున్న అవినాష్ అనూహ్య పరిస్థితుల మధ్య ఆ షో వదిలి బిగ్బాస్ ను ఎంచుకోవాల్సి వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా తనకు ఆదాయం తెచ్చిపెట్టిన జబర్దస్త్ షో ను మూడు నెలలు బిగ్బాస్ ఇంటిలో పోటీ పడేందుకు అవినాష్ మొగ్గు చూపాడు. దీని వల్ల మొదట ఆర్థికంగా నష్టపోయినా బిగ్బాస్ ముగిసే సమయానికి అనుకున్న దానికన్నా ఎక్కువగానే లాభం పడ్డాడు.
ఇక అతనికి కావలసినంత పాపులారిటీ కూడా వచ్చేసింది. ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తన క్రేజ్ రెట్టింపు చేసుకున్నాడు. దీంతో ముక్కు అవినాష్ కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఒక భారీ సినిమాలో అతడు అవకాశం కూడా పట్టేశాడు. మొత్తానికి బిగ్బాస్ ద్వారా ఎంటర్టైనర్ అనే ట్యాగ్ తెచ్చుకున్న అవినాష్ షో గడిచేకొద్దీ తరచూ ఒత్తిడికి లోనయి కోపం ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఇదే అతని పతనానికి దారితీసింది
అయితే ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత అతని అప్పులన్నీ తీరిపోయినట్లు ఇంకా డబ్బులు మిగిలినట్లు వెల్లడించాడు. షో లోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తనను ఒకసారి కలవమని చెప్పినట్లు అవినాష్ వెల్లడించాడు. తన సినిమాలో అవకాశం ఇస్తానని కూడా ప్రామిస్ చేసినట్లు ఈ కమెడియన్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న F3 చిత్రం లో కీలక పాత్ర పోషించ బోతున్నాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అనిల్… అవినాష్ టైమింగ్ కు ముచ్చటపడి అతని కోసం ఒక మంచి కామెడీ రోల్ క్రియేట్ చేశాడు అనే టాక్ కూడా వినిపిస్తోంది.