న్యూస్ సినిమా

రవితేజ క్రాక్ ట్రైలర్ చూసి షాకింగ్ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు ..?

Share

రవితేజ క్రాక్ ట్రైలర్ తాజాగా రిలీజైన సంగతి తెలిసందే. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో క్రాక్ సినిమా మీద గత కొన్ని రోజులుగా రక రకాల రూమర్స్ వస్తున్నాయి. వరసగా రవితేజ సినిమాలు ఫ్లాప్ గా నిలిస్తున్నాయి. దాంతో క్రాక్ సినిమా మీద కూడా గత చిత్రాల ప్రభావం పడుతుందన్న టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో బలుపు, డాన్ శీను’ లాంటి మాస్ ఎంటెర్టైనర్స్ వచ్చి బ్లాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టాయి. దాంతో ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాగా రవితేజ – గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న క్రాక్ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Krack Trailer: Ravi Teja Steals The Thunder | Gulte - Latest Andhra  Pradesh, Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photos

ఒంగోలులో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో గోపీచంద్ ఈ సినిమాని రూపిందించాడు. ఈ క్రమంలో క్రాక్ సినిమా విషయంలో చిత్ర బృందం భారీ స్థాయిలో ప్రమోషన్ చేస్తూ ప్రేక్షకుల్లో అంచనాలను అంతకంత పెంచుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నూతన సంవత్సర సందర్భంగా క్రాక్ సినిమా నుంచి మాంచి యాక్షన్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి ఊహించని విధంగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెసాన్స్ వస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి కూడా ఈ సినిమా కి ప్రశంసలు దక్కుతున్నాయి.

లాక్ డౌన్ తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ షాతిలో సందడి చేయడానికి సంక్రాంతి బరిలో దిగబోతున్న రవితేజ క్రాక్ సినిమా గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకున్నారు. వాస్తవంగా ఈ సినిమాతో పాటు రానా అరణ్య, రాం రెడ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కాని రవితేజ క్రాక్ సినిమాకే హైప్ ఎక్కువగా నెలకొంది. ఇక తాజాగా రిలీజైన క్రాక్ ట్రైలర్ తో రవితేజ బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే రవితేజ వరసగా ఫ్లాప్స్ అందుకుంటుండటం తో కొంతమంది ఈ సినిమా మీద నెగిటివ్ గా మాట్లాడుకున్నారు. రొటీన్ సినిమా అన్న కామెంట్స్ కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికి క్రాక్ ట్రైలర్ షాకిచ్చిందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారట.


Share

Related posts

అయోధ్య‌కు పొంచి ఉన్న వ‌ర‌ద ముప్పు.. భూమి పూజకు ఎఫెక్ట్‌..?

Srikanth A

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా గోపూజ మహోత్సవాలు.. సంబరాల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్

somaraju sharma

Prashanth Neel: సలార్ తర్వాతే అది డిసైడ్ అవుతుందీ అంటున్న ఫ్యాన్స్..

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar