Home Loan: ప్రతి ఒక్కరూ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే తక్కువ ధరకే ప్రాపర్టీ సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీకు ఒక శుభవార్త.అదిరిపోయే ఆప్షన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు ఆన్లైన్ వేలం నిర్వహించనున్నాయి. ఇందులో మీరు మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే ఇల్లు ప్రాపర్టీను కొనుగోలు చేయవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కలిసి ఒకే చోట ఈ – వేలం యాప్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి.

ఈ యాప్ ద్వారా కస్టమర్లు ఇంటి నుంచే ప్రాపర్టీ, ఇల్లు వంటి వాటిని కొనుగోలు చేయవచ్చు. ప్రాపర్టీ లొకేషన్, వేలం అమౌంటు వంటి తదితర వివరాలన్నింటినీ కూడా ఈ యాప్ ద్వారానే మీరు తెలుసుకోవచ్చు.. దీని ద్వారా ప్రాపర్టీ కొనుగోలు చేయడం మరింత సులభం ఉంటుంది. ఎటువంటి మోసపూరిత దాడులకు చోటు ఉండదు. ఈ యాప్ లో దాదాపు 5 లక్షల ప్రాపర్టీల వివరాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఇల్లు లేదా ఇతర ప్రాపర్టీలు మీరు కొనుగోలు చేయవచ్చు.
వాస్తవానికి బ్యాంకు నుంచి లోన్ పొంది ప్రాపర్టీలు లేదా ఇల్లు కొనుగోలు చేసిన వారు తిరిగి లోన్ చెల్లించకపోవడంతో బ్యాంకులు ఆ ప్రాపర్టీ ఇల్లను స్వాధీనం చేసుకుంటాయి ఇలా స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీలను ఇళ్లను బ్యాంకులో ఆన్లైన్లో వేలం వేస్తూ ఉంటాయి. ఇలా మీరు కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్ రేటు కే ప్రాపర్టీ పొందవచ్చు బ్యాంకులో అన్ని లీగల్ పరమైన అంశాలను క్లియర్ చేసి మీ పేరు పైన ఆ ప్రాపర్టీని లేదా రిజిస్టర్ చేయించి ఇస్తాయి. తక్కువ ధరకు లభించే ఈ వేళంలో ప్రాపర్టీ లేదా ఇల్లును మీరు సొంతం చేసుకోవచ్చు.