బిగ్ బాస్ నాలుగవ సీజన్ చూసే ప్రేక్షకులందరికీ ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హౌస్ లో కొన్ని ప్రేమ జంటలు ఏర్పడ్డాయి. అవి ప్రేమ జంటలు అని అధికారికంగా ఎవరు చెప్పలేకపోయినా వారి మధ్య అన్యోన్యత, సాన్నిహిత్యం ఇక ఒకరితో మాట్లాడితే మరొకరు ఫీల్ అయిపోయే తత్వం చూసి చాలా ఈజీగా చెప్పవచ్చు.
ఇక ఇదే సమయంలో కొంతమంది ప్రేక్షకులకి మరి కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. మనం చూసేది తెలుగు బిగ్ బాసే నా అని అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు రాని వాళ్ళని తీసుకుని రావడం ఒక పొరపాటు అంటే తెలుగులో గళగళా మాట్లాడే నైపుణ్యం ఉన్న వాళ్లు కూడా ఇంగ్లీష్, హిందీ లో మాట్లాడుతున్నారు. ఈ విషయంలో ఈ సీజన్ వరకు బిగ్ బాస్ కూడా సరిగా పట్టించుకోలేదు అని చెప్పాలి.
కానీ నాగార్జున మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ రావడంతో ఈ వారం వీకెండ్ ఎపిసోడ్లో వారిపై విరుచుకు పడ్డారు. ప్రస్తుతం జోడీగా కొనసాగుతున్న హారిక-అభిజిత్ లకు అయితే పూర్తి స్థాయిలో కోటింగ్ ఇచ్చేశారు. తెలుగు రాకపోయినా మోనాల్ మాట్లాడేందుకు చాలా ప్రయత్నిస్తోందని వచ్చిన మీ ఇద్దరు మాత్రం ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారని అభిజిత్-హారిక లను నిలబెట్టి పరువు తీసేశారు. అభి ఏదో సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తుంటే అసలు వినిపించుకునే స్థితిలో నాగార్జున లేదు.
కనీసం మీ మైండ్ లోని ఆలోచనలు కూడా ఇంగ్లీషులోనే మాట్లాడటం ఎంతవరకు సబబు అని నాగార్జున ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించిన ఫుటేజీని కూడా వేసి నాగార్జున వారిద్దరి పరువు తీశారు. మరొకవైపు ఈ విషయంలో మోనాల్ ప్రశంశలు అందుకుంది. హారిక తన యూట్యూబ్ ఛానల్ లో తెలుగు గళగళాఅ మాట్లాడుతుంది. అభిజిత్ కూడా చక్కగా మాట్లాడగలడు. కానీ వీరిద్దరూ ఇలా చేయడం వల్ల నాగార్జున సీరియస్ కావడం కరెక్టే అంటున్నారు నెటిజన్లు.
English lo matladinanduku #Nagarjuna fire on #Harika & #Abijeet ?#BiggBossTelugu4 Today at 9 PM on @StarMaa pic.twitter.com/HMfrRiLHEp
— starmaa (@StarMaa) October 3, 2020