సోషల్ మీడియాలో దేత్తడి హారిక పేరు తెలియని వారుండరు. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో విషయాలపై వీడియోలు తీస్తూ తన సహజ నటనతో గుర్తింపు తెచ్చుకుంది హారిక. దీనితో పాటు ఎంతో మంచి పేరును కూడా తన ఖాతాలో వేసుకుంది. సమాజంలో తను పొందిన పేరు ప్రఖ్యాతలతోనే బిగ్ బాస్ 4 లోకి అడుగు పెట్టింది.
బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి తన ఆక్టివిటీతో ప్రేక్షకులను ఏదో విధంగా ఆకట్టుకుంటూనే ఉంది. అయితే రీసెంటుగా హారిక బ్రదర్ ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి అదేంటో చూసేద్దాం…
బిగ్ బాస్ లో ఉండే ప్రతి కంటెస్టెంట్ తన ప్రతిభను బయట పెట్టడానికి తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే దేత్తడి హారిక కూడా ట్రైయల్స్ వేస్తూనే ఉంది. అందులో భాగంగానే చిన్న చిన్న బట్టలు తొడగడం, హాట్ గా ఎక్స్ పోజ్ ఇవ్వడం లాంటివి చేస్తూనే ఉండడం గమనించవచ్చు. ఇవి చేయడం మూలంగా అందరి దృష్టిలో పడడానికి ప్రయత్నిస్తుందని అర్థమవుతోంది. దీనితో ఆడియెన్స్ లీస్ట్ ను పెంచుకుంటోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదే కాకుండా ఈ మధ్య ఆమె వేరే విషయంలో కూడా షోలో హైలెట్ గా నిలుస్తోంది. గత సీజన్లలాగే ఈ సీజన్ లో కూడా లవ్ ట్రాక్ లు భాగానే కొనసాగుతున్నాయి. అభిజీత్, మోనల్, అఖిల్ మధ్యన ఇదే తంతు కొనసాగుతున్న విషయం విధితమే. అయితే హారిక అభిజిత్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడంతో వారి మధ్య కూడా లవ్ ట్రాక్ నడుస్తుందని అందరూ అభిప్రాయ పడుతున్నారు. దీనికి తోడు మోనాల్ గజ్జర్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం దీనికి బలం చేకూరిందని చెప్పొచ్చు.
రోబో హ్యూమన్ టాస్క్ ల విషయంలో వీరిరువురి విషయంలో అభిజీత్ చార్జింగ్ హారికకు పెట్టడం నాగార్జున సైతం ఈ విషయాన్ని వెళ్లడించడంతో వీరి మధ్య బంధం బయటపడింది. అలాగే హోటల్ టాస్క్ లో వీరిద్దరు డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుకోవడం సందేహాన్ని కలుగజేసింది.
ఇలా ఎవరికి వారు పర్ఫామెన్స్ లు ఇవ్వడంతో ఈ షో ముందుకు పోతోంది. అలాగే బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య డీల్ టాస్క్ విషయంలో హారిక తన జుట్టును కత్తిరించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో హారికకు తన బ్రదర్ వార్నింగ్ ఇచ్చినట్టు ఆమె చెప్పింది. అయితే ఆ విషయం స్పందించిన హరిక అన్న హారిక జట్టు కత్తిరించుకోవడంలో తనకు ఎలాంటి కోపం లేదని, కాని నిన్ను టీజ్ చేయడానికి నాకో అవకాశం వచ్చిందని తెలిపారు. దాంతో నిన్ను ఇకపై వదలను బుజ్జితల్లి అని పోస్ట్ చేశాడు. ఇదే విషయం సోషల్ మీడియాలో వైరగా మారింది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!