ముక్కు అవినాష్.. ప్రస్తుతం తెగులు నాట పరిచయం అక్కరలేని పేరు. ఎందుకంటే జబర్ధస్త్ షో ద్వారా తన అభినయం, అదిరిపోయే స్కిట్లతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, అవినాష్ మొదట్లో మిమిక్రి ఆర్టిస్టుగా తన కెరియర్ను ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఎన్నో కార్యక్రమాల్లో తన ప్రదర్శనలతో ప్రజలను అలరించాడు. దీంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే రికార్డు స్థాయి రెటింగ్స్ తో దూసుకుపోతున్న జబర్ధస్త్ కామెడీ షోలో అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆయన సపోర్ట్ ఆర్టిస్టుగా మొదలెట్టి.. టీం లీడర్‌గా ఎదిగాడు. దీంతో మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు.
ఇదిలా ఉండగా.. ఇటీవలే బిగ్‌బాస్ 4 రియాలిటీ షో మొదలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ షో ప్రారంభంలో ప్రేక్షకులను పెద్దగా అకట్టుకోకపోవడం, ఇటు ఐపీఎల్ 2020 మొదలవడంతో బిగ్‌బాస్ 4 మరింత డీలా పడింది. టీఆర్పీ రేటింగ్స్ సైతం పడిపోయాయి. ఈ పోటీని తట్టుకుని నిలబడే విధంగా ప్లాన్ చేసిన బిగ్ బాస్ షో యాజమాన్యం వైల్డ్ కార్డ్ ఎంట్రీల పేరుతో మంచి గుర్తింపు ఉన్న పలువుని బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకున్నారు. దీనిలో బాగంగానే జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయిన ముక్కు అవినాష్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి తనదైన కామెడీ స్టైల్‌తో బాగ్‌బాస్ హౌస్‌లో జోష్ తీసుకువస్తున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి నాలుగు వారాలు దగ్గరపడుతున్న ఇప్పటివరకూ ఒక్కసారి కూడా నామినేషన్స్‌లోకి రాలేదంటే ఆయన ప్రదర్శనను అర్థం చేసుకోవచ్చు.
అయితే, బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఏంట్రీ ఇచ్చిన సందర్భంగా.. ఇప్పటివరకూ గడిచిన తన జీవితం, జరిగిన ఆటుపోట్లు, ఎదుర్కొన్న సమస్యల గురించి, కెరియర్ ప్రారంభం గురించి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే తన లైఫ్‌లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాననీ, అయితే, తన లవ్ విఫలమైందని చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన లవ్ స్టరీ, ఆ అమ్మాయి గురించి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. ఆయన లవ్ విఫలమైన తర్వాత ఏం చేశారు అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
తాజాగా ముక్కు అవినాష్ తమ్ముడు అజయ్ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తన అన్న అవినాష్ లవ్ బ్రేకప్ గురించి కూడా చెప్పుకొచ్చాడు. తాము ముగ్గురం అన్నదమ్ముల్లమనీ, అందరం ఒకే హాస్టల్లో ఉండి చదువుకున్నామని వెల్లడించాడు. తన అన్న అవినాశ్ మల్టీ టాలెంటెడ్ వ్యక్తి అనీ, స్కూల్ రోజుల్లోనే తనదైన మిమిక్రి ప్రదర్శనలతో అకట్టుకునే వాడని చెప్పాడు. అయితే, తన అప్పుడు ఓ అమ్మాయి ఇష్టపడ్డాడనీ, ఎప్పుడు తన వెంటే తిరిగే వాడని చెప్పాడు. తనకు డబ్బులు అవసరమైతే తననే ఆడిగే వాడిననీ, చిన్నతనం కారణంగా వరుసలు తెలియక అక్క అని పిలిచే వాడినని తెలిపాడు. అయితే, ఆ అమ్మాయి పెండ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ ఏం జరిగిందే తెలియదు ఇద్దరు విడిపోయారని చెప్పాడు.
ఈ ఘటన తర్వాత అవినాష్ కెరియర్ పై దృష్టి సారించడని వెల్లడించాడు. జీవితంలో అనేక సమస్యలను అధిగమించిన ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నాడని చెప్పాడు. బిగ్‌బాస్ 4 లో తన అన్నను విన్నర్‌గా చూడాలని ఉందని తెలిపాడు. దీని కోసం ముక్కు అవినాష్‌కు అందరూ సపోర్ట్ చేయాలని కోరాడు.