ప్రస్తుతం కాలం చాల ఆధునికత సంతరించుకుంది. ఈ ఆధునిక రోజుల్లో సమాజంలో అన్ని వ్యవస్థలు, బంధాలు మరియు బాంధవ్యాలు ప్రమాదం లో పడ్డాయి.
భార్య భర్త ల గొడవలు, ఆస్తిపాస్తులు కోసం తల్లిదండ్రులను చంపేసే కన్న కొడుకులు మరియు కూతుర్లు, తోడబుట్టిన వారి మధ్య ఆస్తి గొడవల తో బంధాలు బంధుత్వాలు పేమ ఆప్యాయత పూర్తిగా మంటకలిసిపోయాయి. ఇటువంటి తరుణంలో అమెరికాలో ఆరేళ్ల వయసు కలిగిన చిన్న బాలుడు తన చెల్లి కోసం చేసిన సంఘటన ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సొంత చెల్లెలు కోసం ప్రాణాలకు తెగించి ఆరు సంవత్సరాల వయసు కలిగిన ఈ బుడతడు కుక్క తో పోరాడి ముఖానికి 90 కుట్లు వేయించుకోవటం జరిగింది. బ్రిడ్జర్ వాకర్ అనే 6 సంవత్సరాల అబ్బాయి తన చెల్లి వెంట కుక్క పడటం చూసి తన గురించి కూడా ఆలోచించకుండా చుట్టుపక్కల మనుషులు ఎవరూ రాకపోయినా కానీ పరిగెత్తి మరీ తన చెల్లెను కాపాడుకున్నాడు. ఆ కుక్కతో ప్రాణాలకు తెగించి మరీ పోరాడి ఈ అన్న తన చెల్లెల ప్రాణాలను కాపాడుకోవటం జరిగింది.
ఈ విషయాన్ని బ్రిడ్జర్ వాకర్ బంధువులు సోషల్ మీడియాలో వెల్లడించారు. నా మేనల్లుడు సూపర్ హీరో, ప్రపంచంలో బంధాలు బాంధవ్యాలు కోల్పోతున్న ఇటువంటి రోజులో కేవలం ఆరు సంవత్సరాల వయస్సులో నా మేనల్లుడు తన చెల్లెలి కోసం 90 కుట్లు వేయించుకునేలా కుక్క తో పోరాడి… రియల్ హీరో అనిపించాడు అని కొనియాడారు. ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్లు బ్రిడ్జర్ వాకర్ ఈజ్ రియల్ హీరో అని అభినందిస్తున్నారు.