ట్రెండింగ్ న్యూస్ సినిమా

Dear Megha: “బాగుంది ఈ కాలమే” మెలోడియస్ సాంగ్ ను ఆలపించిన సిద్ద్ శ్రీరామ్..

Share

Dear Megha: అది తరుణ్, మేఘ ఆకాష్ జంటగా నటించిన చిత్రం డియర్ మేఘా.. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి పోస్టర్స్, టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.. తాజాగా ఈ చిత్రం నుండి “బాగుంది ఈ కాలమే” మెలోడియస్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు నిర్మాతలు..!!

Dear Megha: Bagundi Eekalame melodious song sing by Sid Sriram
Dear Megha: Bagundi Eekalame melodious song sing by Sid Sriram

ఈ మెలోడీ సాంగ్ కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా ప్రముఖ గాయకుడు సిద్ద్ శ్రీరామ్ ఆలపించారు.. తాజాగా విడుదలైన ఈ పాట కొద్ది క్షణాల్లోనే మంచి వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం.. ఈ సినిమాలో ఆది తరుణ్ తో పాటు అర్జున్ సోమయాజుల కూడా నటిస్తున్నారు. మేఘ ఆకాష్ ఈ చిత్రంలో అర్జున్ సోమయాజుల తో లవ్ చేస్తుంది. ఆ తరువాత ఆదిత్ ఆరుణ్ ఎలా పరిచయం అవుతారు. చివరికి ఈ ఇద్దరిలో మేఘా ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అనే విషయాన్ని సినిమాలో చూడాలి. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గౌరీ హరి సంగీతం సమకూరుస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Share

Related posts

బ్రేకింగ్: విశాఖపట్నంలో ఘోర ప్రమాదం.. క్రేన్ కూలి ఆరుగురి మృతి

Vihari

Poll : టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టుని ఏ కోణంలో చూడవచ్చు…?

kavya N

కేటీఆర్ ప‌రువు గోవిందా… ఇలా జ‌రుగుతుంద‌ని అనుకోలేదేమో!

sridhar