RRR: “ఆర్ఆర్ఆర్” లో “కొమురం భీముడో” సాంగ్ ఎంత పెద్ద హైలెట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ చూపించిన హావభావాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. పెద్ద పెద్ద నటులు సైతం కొమురం భీముడో లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ చూసి సినిమా తర్వాత సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా సాధించి.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయి పెంచటం జరిగింది. ఈ క్రమంలో ఇటీవల సినిమాకి సంబంధించి ఒకో సాంగ్ సినిమా యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేయటం మనం చూస్తూనే ఉన్నాం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇప్పటికే కొన్ని పాటలు రిలీజ్ చేయగా మొన్న “కొమురం భీముడో” సాంగ్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సాంగ్ చూసిన దిగ్గజ దర్శకుడు లెజెండరీ కె విశ్వనాథ్.. ఎన్టీఆర్ నటన పై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన సోషల్ మీడియాలో పాట… చూస్తున్న వీడియో ని రిలీజ్ చేశారు. ఎప్పటి నుండో ఈ సాంగ్ రిలీజ్ చేయాలని అభిమానులు కోరుతూ ఉండగా మొన్న రిలీజ్ చేశారు. దీంతో 24 గంటల్లోనే ఐదు మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన నాటి నుండి యు ట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.
సరిగ్గా సినిమా మధ్యలో వచ్చే ఈ కొమురం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ ని చరణ్ కొరడాలతో కొట్టడం.. అదే సమయంలో బ్రిటిష్ సామ్రాజ్యం అనేక కఠినమైన శిక్షలు విధించడం సినిమా చూస్తున్న ప్రేక్షకులను ఎంతగానో హృదయాలను పిండేసేటటూ ఉంటుంది. అయినా కానీ బ్రిటిష్ సామ్రాజ్యానికి తలదించనీ వ్యక్తిగా ఎన్టీఆర్ చాలా పొగరుగా.. ఈ పాటలో పేస్ లో చూపించే హావభావాలు.. నటనలో నైపుణ్యం కలిగిన పరిపూర్ణ నటుడు అన్నట్టు నిరూపించాయి. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రిలీజ్ కావడంతో భారీ ఎత్తున వ్యూస్ తో పాటు లైకులు, కామెంట్లు వస్తున్నాయి.