ఇక మీరు 1980 చివర్లో లేదా 1990 ప్రారంభపు సంవత్సారాల్లో జన్మించినట్లయితే మీకు చాలా స్వీట్ మెమోరీస్ ఉంటాయి. అప్పట్లో ఇప్పటి మాదిరిగా స్మార్ట్ ఫోన్స్ ఉండేవి కావు. ఇంత ఇంటర్ నెట్ సౌకర్యం ఉండేది కాదు. అయినా ఇవన్నీ అప్పుడు అవసరం ఉండేవి కూడా కాదు. సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లో గడిపిన ప్రతి క్షణం ఒక జ్ఞాపకంగా మిగిలి ఉంటుంది ప్రతి ఒక్కరికీ.
గతంలో ఉపయోగించిన పరికరాలు, చూసిన టీవీ షోస్, ఆడిన ఆటలు, విన్న పాటలు ఇలా ఒకటేమిటి చాలానే మీ జ్ఞాపకాల్లో గూడు కట్టుకుని ఉంటాయి. మరి అలాంటి వాటిలో కొన్నింటిని చూద్దామా.
ప్రస్తుతం లభించే పెప్సీ కూల్ డ్రింక్ గురించి కాదు మేము చెప్పేది. మీరు చిన్నతనంలో చిన్నప్యాకెట్స్ లో ఉండే పెప్సీని తినే ఉంటారు కదా. దాని గురించి. పెప్సి అంటూ అప్పట్లో వీటిని అమ్మేందుకు వచ్చే వారు అనేవారు. 50 పైసల నుంచి ఒక రూపాయ ధర వరకు లభించే వీటిని అప్పట్లో భలే కొనుక్కోని తినేవారు. మీరూ ఇలా తినే ఉండి ఉంటారు. ఎండకాలంలో వీటికి భలే గిరాకీ ఉండేది. అప్పట్లో మీరు జేబులో ఉన్న డబ్బునంతా వీటిని కొనుక్కునేందుకే ఉపయోగించేవారు కదూ.
అప్పట్లో లెటర్స్ రాయడం అనేది ఒక కళ. ఏ సమాచారమైనా లెటర్ ద్వారానే అవతలి వ్యక్తులకు చేరేది. మొబైల్ ఫోన్లు, ల్యాండ్ లైన్ ఫోన్ల వాడకం విస్తృతంగా ప్రచారంలో రాకముందు ఎక్కువగా ఇన్లాండ్ లెటర్స్ అందుబాటులో ఉండేవి. వాటి ద్వారానే కమ్యూనికేషన్ సాగేది. ఒకవేళ మీరు ఆ సమయంలో మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఉంటే మీరు కచ్చితంగా ఇన్లాండ్ లెటర్స్ అందుకోని ఉంటారు.మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా గోలీ లేదా గోటీల ఆట ఆడే ఉంటారు. ఇక ఈ ఆట ఆడేటప్పుడు మీ తోటివారితో మీరు గొడపడి కూడా ఉంటారు. ఇక తల్లిదండ్రులేమో ఈ ఆట ఆడవద్దంటూ పిల్లలకు సూచించేవారు. అయినా వినేవారు చాలా తక్కువ.
అప్పట్లో టేప్ రికార్డర్ లో పాటలు వినడమంటే అందరికీ భలే ఇష్టం ఉండి ఉంటుంది. క్యాసెట్ వేసి పాటలు విన్నవారు చాలామందే ఉంటారు. ఒక్కసారి మీ మెమోరీస్ లోకి వెళ్తే ఇవన్నీ గుర్తొస్తాయి. ఇక ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఆ రోజుల్లో సైకిల్ ఉండేది. ఇంట్లో సైకిల్ ఉంటే దాన్ని నేర్చుకునేందుకు మీరు కచ్చితంగా ప్రయత్నించి ఉంటారు. ఇక మీ చిన్నినాటి జ్ఞాపకాల్లో సైకిల్, సైకిల్ కు సంబంధించిన విషయాలు కచ్చితంగా ఉండే ఉంటాయి.
చిన్నప్పుడు దెయ్యం అంటే భయం తో మన మీదకి వస్తుందేమోనని అది రాకుండా ఉండాలంటే ఇంటి ముందు ఓ స్త్రీ రేపు రా అని రాయాలి అని అలా రాస్తే దెయ్యం వెనక్కి వెళ్లి పోతుంది అని నమ్మేవాళ్ళు. ఆదివారం వచ్చిందంటే మొదట శక్తిమాన్ కొంతకాలం తర్వాత పంచతంత్రం, అమృతం. ఈ సీరియల్స్ లేకుండా ఆదివారమే గడిచేది కాదు. వాటి పాటలు కూడా ఇప్పటికీ మనకు గుర్తు ఉంటాయి. సీతాఫలం రేగుపండు లాంటి వాటిలో ఉండే పెద్దపెద్ద విత్తనాలు అంటే తీసేయొచ్చు కానీ పుచ్చకాయ పపాయ ఇలాంటివి అప్పుడప్పుడూ తెలియకుండా నోట్లో కి వెళ్లిపోయేవి. అప్పుడు చెట్లు వచ్చేస్తాయి ఏమోనని భయపడేవారు ఎంత భయపడేవాళ్లో. కొంతమంది అయితే ఏడ్చేవాళ్ళు కూడా నెమలి పిల్లల్ని పెడుతుంది . కానీ నెమలి ఈక ఎలా పిల్లల్ని పెడుతుంది ? అది తెలీదు కానీ నెమలి ఈక మాత్రం కచ్చితం గా పెడుతుంది. ఇంకా దానికి ఆకులు ఆహారం కూడా పెట్టాలి. అపుడే పిల్లలు పెడుతుంది. లాజిక్ ఆలోచించకండి . ఇది కనుక్కున్న ఐన్స్టీన్ లు మనమే. అదే నిజమైతే ఈ పాటికి ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు అయ్యే వాళ్లు.
ఎక్కడో అక్కడ ఎవరూ ఒక్కళ్ళు ఇవి కూడా నమ్మే ఉంటారు. ఎండా-వానా ఒకేసారి వస్తే,ఎక్కడో కుక్కకు నక్కకు పెళ్లి అవుతుందట అని అనుకునే వాళ్ళం . సూర్యగ్రహణం అంటే సూర్యుడిని పాము మింగేయడం అని ఎలా మింగేస్తుందో చూద్దామని ఎదురుచూడటం . ఇలా చిన్నప్పుడు తెలిసీ తెలీక ఏవో చేస్తాం. పెద్దయిన తర్వాత చూసుకుంటే ఏంటి మనమేనా ఇవన్నీ నమ్మింది? అని అనిపిస్తుంది. కానీ చిన్నతనంలో చేసిన ఇలాంటి పనులే నవ్వుకోడానికి మనకి జ్ఞాపకాలు. పైన చెప్పిన వాటిలో మీరు కూడా ఏదో ఒకటి అయినా చేసే ఉంటారు కదా.