Internet: మొబైల్ ఫోన్, కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ వంటివి వాడేవారికి ఇంటర్నెట్ స్లోగా రావడం సమస్యగా మారుతోంది. వీటి ప్రభావం వలన ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం ఒకే టైం కి చేయాలి అనుకున్న పని ఇంటర్నెట్ కనెక్షన్ స్లో గా వుంటే.. మధ్యంతరంగా ఆగిపోవడం లాంటివి జరుగుతుంటాయి . అదేవిధంగా వెబ్ పేజ్ లోడ్ అవ్వకపోవడం మరియు యూట్యూబ్ లోని వీడియోలు బఫర్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలను ప్రతి ఒక్కరూ ఎదుర్కొని ఉంటారు. ఒక్కొక్కసారి వేగవంతమైన నెట్ రావడం. మరియు అసలు లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.

వీటి వలన ఇలా జరుగుతోంది అనే కారణం ఎవరికి తెలియదు. కావున దానిని ఏ విధంగా మార్పు చేసుకోవాలి. అలా చేయడం ద్వారా మనకు నెట్ స్పీడ్ గా వస్తుంది అనేది ఈ సెట్టింగ్ ద్వారా తెలుసుకుందాం..
దీనికి ముఖ్య కారణం తెలిస్తే మీరు మీ స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. మంచి ఇంటర్నెట్ కోసం మీరు మీ బ్యాగ్రౌండ్ లో రన్ అవుతున్న కొన్ని యాఫ్ లను మూసివేయాలి.ఎందుకంటే మీ ఫోన్ వెనక ఈ యాప్స్ పనిచేస్తూ ఉంటాయి.
అందుకే ఇంటర్నెట్ నెమ్మదిగా పనిచేస్తూ ఉంటుంది.ఒకేసారి రెండు యాప్ లను డౌన్లోడ్ చేయడం వంటివి చేయరాదు. ముఖ్యంగా అత్యంత ఇంటర్నెట్ వేగాన్ని పెంచుకోవాలి అంటే మన ఫోన్లో ఉన్న ఫైల్స్ ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. అవసరమైన అనువర్తనాలను మన ఫోన్లో ఉంచడం ద్వారా కూడా ఇంటర్నెట్ వేగం పూర్తిగా తగ్గిపోతుంది. రీస్టార్ట్ చేయడం వల్ల ఏదైనా సాంకేతిక లోపాలు ఉన్నట్లయితే సాఫ్ట్వేర్ పరంగా ఏదైనా లోపాలు ఉన్నట్లయితే దానంతట అదే ఫిక్స్ చేసుకోవాలి అంటే మీరు ఒకసారి ఫోన్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత రెండు మూడు నిమిషాలు ఆగిన తరవాత ఎలక్ట్రికల్ ప్లగ్ కి కనెక్ట్ చేసి రీస్టార్ట్ చేయండి. దీని ద్వారా మీ ఫోన్లో ఉన్న ఇంటర్నెట్ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది..