Kuppintaaku: ఒక్క ఆకులో వందకు పైగా ఉపయోగాలు..!! 

Share

Kuppintaaku: ప్రస్తుతం అందరు రసాయన ఔషధాల కంటే సాధారణ పద్ధతులను ఆచరిస్తున్నారు.. ఔషధాల తయారీలో విరివిగా వాడే మొక్కలలో కుప్పింటాకు ఒకటి.. కుప్పింటాకు లో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి.. !! ఈ మొక్క ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!! మరి ఈ మొక్క వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..!!

Kuppintaaku: Health Benifits
Kuppintaaku: Health Benifits

ఈ ఆకులలో అద్భుతమైన ఔషధ గుణాలు..!!
కుప్పింటాకు లో ఫినోలిక్ కాంపౌండ్స్, ఫ్లేవనాయిడ్స్, స్టెరాయిడ్స్, టానిన్స్, సపోలిన్ ఉన్నాయి. ఈ సమ్మేళనాలన్నీ యాంటెల్మింటిక్, భేదిమందు, ఎస్పెక్టరెంట్, యాంటీ ఆక్సిడెంట్స్, డిటాక్స్ ఏజెంట్, యాంటీఇన్ఫ్లమేటరీ వంటి ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంది.. పుండ్లు, గాయాలు, గజ్జి వంటి చర్మ సంబంధిత సమస్యలకు కుప్పింటాకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆకుల రసంలో నిమ్మరసం కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. దీనిని గజ్జి తామర ఉన్నచోట రాయడం వలన త్వరగా ఉపశమనం లభిస్తుంది. దీనిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కారణంగా మొటిమల చికిత్సలో కూడా దీనిని ఉపయోగిస్తారు.. ఈ ఆకులను అవాంచిత రోమాలు తొలగించడానికి మేలు చేస్తాయి ఈ మొక్క ఆకులు ఎండబెట్టి పొడి చేసి పెట్టుకోవాలి. గోరువెచ్చని నీటిలో ఈ ఆకుల పొడి వేసే మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛితరోమాలు ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గుతాయి.. ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి అందులో కొంచెం పసుపు వేసి తయారు చేసుకున్న పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగితే ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది.

Kuppintaaku: Health Benifits
Kuppintaaku: Health Benifits

కుప్పింటాకు తో మధుమేహానికి చెక్..!!

దీనిలో ఉండే పాలీఫెనాల్స్ స్టెరాయిడ్స్ డయాబెటిక్ నిరోధక లక్షణాలను అందిస్తాయి ఈ సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.. కుప్పింటాకు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది..
ఈ మొక్క వేర్లు తో పళ్ళని తోమితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. అంతేకాకుండా చిగుళ్ల నుండి కారే రక్తాన్ని కూడా ఆపుతుంది ఇది పంటి నొప్పిని తగ్గిస్తుంది. కాబట్టి పంటి నొప్పి అన్నింటికీ చక్కని ఔషధంలా పనిచేస్తుంది. కుప్పింటి ఆకులను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి కషాయంలా తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని తీసుకుంటే మలబద్ధకం సమస్య రాదు. శరీర నొప్పులు తగ్గించే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆకులను నూరి కొబ్బరి నూనె లో కలిపి నూనె మాత్రమే మిగిలే వరకూ మరిగించాలి. అలా తయారు చేసుకున్న నూనె ను నొప్పి ఉన్న ప్రదేశం లో రాస్తే ఫలితం కనిపిస్తుంది.ఈ మొక్క క్రియాశీల జీవక్రియలను కలిగి ఉంటుంది. ఇది గుండె కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుంది. హృదయ సంబంధ వ్యాధుల నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంటుంది.. ఈ మొక్కలు ఉంటే ప్లేవనాయిడ్స్, టర్పేనాయిడ్స్, స్టెరాయిడ్స్ అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కఫం, దగ్గు, ఆస్తమా నుంచి మమ్మల్ని రక్షిస్తుంది. శ్వాస సంబంధిత సమస్యల ఔషధాల తయారీ లో ఈ మొక్క ఆకు, బెరడు లను ఉపయోగిస్తారు.


Share

Related posts

నరనరానా నారప్ప నామమే..! కళ్ళలో చురకత్తి.., చేతిలో కత్తితో వెంకీ లుక్..!

bharani jella

లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన ఇన్ స్పెక్టర్ సుభోద్ సింగ్ కుటుంబం

Siva Prasad

Sushanth Singh Case : సుప్రీం కోర్టులోనూ సుశాంత్ సింగ్ సోదరికి చుక్కెదురు

somaraju sharma