Shanmukh Jashwanth : యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ ఇటీవల ఫుల్లుగా తాగేసి స్పీడ్ గా కార్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేయడం అందరికీ తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో పీకలదాకా తాగి .. ఇష్టానుసారంగా కారుతో రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొనడంతో .. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే పోలీసులు షణ్ముక్ జశ్వంత్ ని.. అదుపులోకి తీసుకొని బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా 170 రీడింగ్ రావటంతో, పోలీసులు ఐపీసీ సెక్షన్ 337, 279 కింద కేసు నమోదు చేశారు.
దీంతో ఆ టైములో స్టేషన్ బెయిల్ పై బయటకు వచ్చిన ఈ సోషల్ మీడియా స్టార్ తర్వాత తల్లిదండ్రుల సమక్షంలో జరగాల్సిన కౌన్సిలింగ్ కి హాజరు కాలేదట. దీంతో పోలీసులు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడంతో.. షణ్ముఖ్ జస్వంత్ పై కోర్టు ప్రొసీడింగ్స్‌కు జూబ్లి హిల్స్ పోలీసులు సిద్దమవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే మరింత చిక్కుల్లో షణ్ముఖ్ జస్వంత్ కెరియర్ పడటం గ్యారెంటీ అని న్యాయ నిపుణులు తెలుపుతున్నారు.
‘సాఫ్ట్వేర్ డెవలపర్’, ‘సూర్య’ అనే వెబ్ సిరీస్ ల ద్వారా.. సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించిన షణ్ముఖ్ జస్వంత్.. ఇటీవల ఓ టెలివిజన్ రంగంలో పలు పాపులర్ రియాల్టీ షోలలో చీఫ్ గెస్ట్ గా రావటం కూడా జరిగింది. క్రేజ్ వున్న కొద్ది పెరుగుతున్న తరుణంలో .. షణ్ముఖ్ జస్వంత్ పై ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఫైల్ కావటంతో పాటు పోలీసులకు దొరికిన సమయంలో వీడియోలు కూడా బయటకు రావడంతో మనోడి క్రేజ్ మెల్లమెల్లగా తగ్గుతూ ఉంది.