Mango Leaves: మామిడి పండే కాదు ఆకులతో కూడా ఆరోగ్య ప్లస్..!!

Share

Mango Leaves: పండ్ల కే రారాజు మామిడి పండు.. ఈ పేరు చెప్పగానే నోరూరిపోతుంది.. రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. మామిడి పండే కాదు ఆకులతో కూడా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.. మామిడి ఆకు శుభానికి చిహ్నలు.. అందుకే వీటిని ఆలయాల్లో, ఇంటిలో తోరణాలుగా కడుతూ ఉంటారు.. మామిడి ఆకులు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు.. ఆకులతో చేసిన తోరణాలు కడితే మన ఇంట్లోకి ధనలక్ష్మి స్థిరంగా ఉంటుంది అని ఒక నమ్మకం.. ఈ ఆకులు ఇంటికి కట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.. అంతేకాదండోయ్.. ఈ ఆకులలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.. ఇవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో చూడండి..!!

Surprising Health Benefits Of Mango Leaves:
Surprising Health Benefits Of Mango Leaves:

Mango Leaves: మామిడి ఆకులతో ఈ సమస్యలు దూరం..!!

మామిడి ఆకులు విటమిన్ ఏ, బి, సి, డి, ఇ ఉన్నాయి. ఇంకా కాల్షియం, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, ఫ్లేవనాయిడ్స్ , సోపోనిన్స్ ఉన్నాయి. మామిడి ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితే డయాబెటిస్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంటుంది. ఈ టాక్సీన్స్ సమృద్ధిగా ఉన్నాయి. అందువలన ఈ ఆకుల కషాయాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటుంది. మూత్ర సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. ఈ ఆకుల కషాయం లైంగిక సమస్యలు తగ్గించడానికి సహాయపడుతుంది. వీర్య కణాలు వృద్ధి చెందేలా చేస్తుంది. ఈ ఆకుల కషాయం  తాగితే అలసట, ఒత్తిడి, టెన్షన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ కషాయాన్ని మూడు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గిపోతుంది.

Surprising Health Benefits Of Mango Leaves:
Surprising Health Benefits Of Mango Leaves:

ప్రతిరోజు ఈ ఆకుల కషాయాన్ని రాత్రిపూట తాగితే కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుంది. నోట్లో పోసుకొని పుక్కిలించి ఉసేస్తే నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. నోటిపూత, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారటం వంటి దంత సమస్యలు నివారిస్తుంది. అజీర్ణం గ్యాస్ అసిడిటీ సమస్యలతో బాధపడుతుంటే ఈ ఆకులతో తయారుచేసిన నీటిని తాగితే త్వరగా తగ్గుతుంది అన్ని రకాల ఉదర సంబంధిత సమస్యలకు అద్భుతంగా పని చేస్తాయి. ఈ ఆకుల లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలో టాక్సిన్స్ ను తొలగిస్తుంది. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలకు ఆకులతో చెక్ పెట్టవచ్చు. విరోచనాలు సమస్యతో బాధపడుతున్నారు ఆకుల కషాయాన్ని తాగితే ఫలితం కనిపిస్తుంది.

Surprising Health Benefits Of Mango Leaves:
Surprising Health Benefits Of Mango Leaves:

మామిడి ఆకులను ముద్దగా నూరి అని రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి పోటు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని పుండ్లు, గాయాలు లేని చోట రాస్తే త్వరగా మానిపోతాయి. మనం స్నానం చేసే వేడి నీటిలో ఈ ఆకులను వేసి ఐదు నిమిషాల తర్వాత స్నానం చేస్తే శరీరంపై ఉన్న దుమ్ము ధూళిని తొలగిస్తుంది. శారీరక శ్రమ చేసి అలసిపోయిన వారు ఈ నీటితో స్నానం చేస్తే ప్రశాంతత కలుగుతుంది ఒత్తిడినుంచి వెంటనే రిలాక్స్ అవుతారు. ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా పెరుగు కలిపి నల్ల మచ్చలు ఉన్న చోట రాయలి. పది నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది.


Share

Related posts

టిటిడి అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు

Siva Prasad

Nagarjuna: నాగార్జున చేతి లోకి వచ్చినట్లు వచ్చి మిస్ అయిన సినిమాల లిస్టు..!!

sekhar

AP CM YS Jagan: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..ఒకటి కాదు రెండు..

somaraju sharma