(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
బ్రేక్ మీద వెయ్యాల్సిన కాలు ఎక్సిలరేటర్పై వేస్తే ఏమవుతుంది. కారు నీట మునుగుతుందని ఆ మహిళకు అర్ధమయింది. అమెరికా, న్యూజెర్సీలో ఒక మహిళ తన కారును వాష్‌కు తీసుకువచ్చింది. కారును శుభ్రం చేసిన తర్వాత తన కుమార్తెతో కలిసి అందులో ఎక్కింది. బ్రేక్ వేయల్సింది పోయి ఎక్సిలరేటర్పై కాలు వేసింది. కారు చక్కగా వెళ్లి ఆ ముందున్న హాకెన్‌సాక్ నదిలో దూకింది.
అదృష్టవశాత్తూ కారులో ఉన్న తల్లీకూతుళ్లకు ఏమీ కాలేదు. హాకెన్‌సాక్ ఫైర్ డిపార్ట్మెంట్ కారు ఫొటోలు ఫేస్బుక్లో పోస్టు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా పోస్టు చేసింది. కారులో ఉన్న ఇద్దరూ వారంతట వారే బయటకు వచ్చారని ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది.
https://www.facebook.com/HackensackFire/videos/314590925910180/