NewsOrbit
న్యూస్

పవన్ కళ్యాణ్ కు చుక్కలు చూపిస్తున్నదెవ్వరు?

జనసేన కున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కి పంటికింద రాయిలా మారారు.ఆయన్ను ఏం చెయ్యాలో తెలియక జనసేనాని తల పట్టుకూర్చున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

 

నేరుగా గొంతెత్తి రాపాక వరప్రసాద్ ను నిలదీయలేక ఆయన్ను బయటకు పంపలేక తిప్పలు పడుతోంది జనసేన.జనసేన కు కనీసం ఒకే ఒక్క ఎమ్యెల్యే అయినా గెలిచిన ఆనందం లేకుండా చేస్తున్నారు రాపాక వరప్రసాద్. విపక్షాలు వైసిపి పై ముప్పేట దాడి చేసినప్పుడల్లా జనసేన గట్టిగా గొంతెత్తిన ప్రతీసారి రాపాక వరప్రసాద్ సీన్ లోకి దిగి తమ పార్టీ ఆరోపణల గాలి తీసేస్తున్నారు. దీనికి పరాకాష్ట గా ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో రాపాక వైసిపి అభ్యర్ధికి ఓటు వేసి బాహాటంగా ప్రకటించేశారు కూడా. దీనిపై జనసేన ఏమి చేయలేని దుస్థితి ఏర్పడింది.అంతేగాక
ప్రశ్నిస్తామని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణు, జనసేన నాయకులు మీడియా ముందుకు ఏదైనా అంశం పై వస్తే వారికి రాపాక వరప్రసాద్ పై ప్రశ్నల పరంపరని పాత్రికేయుల నుంచి ఎదుర్కొవాలిసి వస్తుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా, అధినేత పవన్ ను పదేపదే ఎండగడుతున్నా మౌనం వహించడాన్ని మీడియా ప్రశ్నిస్తే జవాబు చెప్పుకోలేని పరిస్థితి నేతలకు ఏర్పడుతుంది. రాపాక వరప్రసాద్ సాంకేతికంగా జనసేన ఎమ్యెల్యే అయినా ఆయన వైసిపి ఎమ్యెల్యేగా పక్కాగా వ్యవహారాలు సాగిస్తున్నారు. నిత్యం జగన్ భజన చేస్తూ పవన్ కళ్యాణ్ తీరుపై ఒంటికాలిపై లేస్తున్నారు. అయినా కానీ జనసేన ఉన్న ఒక్క ఎమ్యెల్యే పై చర్యలు తీసుకుంటే ఆయన స్వతంత్ర ఎమ్యెల్యే గా ఉండి పార్టీ పేరే వినిపించకుండా చేసే అవకాశాలు ఉన్నాయన్నది జనసేన భయం.అధికార పార్టీ వైసిపి కూడా రాపాక వరప్రసాద్ జనసేనను వదిలి రావాలని కోరుకోవడం లేదు. ఆ పార్టీలో ఉంటూనే అవసరానికి వైసీపీకి మద్దతుగా ఆయన సీన్ లోకి వస్తే చాలని భావిస్తుంది. జనసేన ఎదుర్కొంటున్న ఈ సమస్యకు పరిష్కారం లేనట్లే కనిపిస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందంటున్నారు






Related posts

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?