NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

ఎంపీ రాజు గారి కొత్త లేఖ లో జగన్ ను పొగిడాడా లేక తిట్టాడా..?

151 ఎమ్మెల్యేలు ఉన్న వైసిపి పార్టీ లో అసమ్మతి చెల్లుచీటీ అని రాజకీయ విశ్లేషకులు అంతా జగన్ గెలిచిన తొలినాళ్లలో వ్యాఖ్యానించారు. కానీ ఒకే ఒక్క ఎంపీ యొక్క సమ్మతి వైసిపి పార్టీ కూసాలనే కదిలిస్తుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు. అతనే రామకృష్ణంరాజు. ముందేమో ఆయన చూపు మొదటినుండి బీజేపీ వైపే ఉంది అని అనుకున్నారు. తర్వాత ఇది అంతా మోడీ వేసిన స్కెచ్ అన్నారు. చివరికి ఆయన మొన్న పవన్ కళ్యాణ్ ని విపరీతంగా పొగిడేసరికి ఇందులో పవన్ పాత్ర ఏమిటి అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీటన్నింటి మధ్య రాజుగారు జగన్ కు వరుస బెట్టి లేఖలు రాస్తూనే ఉన్నారు.

 

ఇప్పటి వరకూ రాజు గారు రాసిన లేఖలు అన్నింటిలో విమర్శలు మరియు తిట్లు లేకపోయినప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ఆయన వీటన్నింటిలో వ్యవహరించడం గమనార్హం. అయితే తాజాగా ఆయన రాసిన మరొక లేఖలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకు రావడం విశేషం. రాష్ట్రంలో వారంతా అష్ట కష్టాలు పడుతున్నారని…. కొన్ని నెలలుగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోమని లేఖలో కోరారు. మొదటి నుండి జగన్ పైన రాజుగారు సాఫ్ట్ యాంగిల్ చూపిస్తూనే ఉన్నారు. తనకు అధినేత నుంది ఏమీ సమస్య లేదని కేవలం పార్టీ కేడర్ తోని చిక్కులు ఉన్నాయని రాజు గారు నొక్కి వక్కాణించారు. గతంలో బహిరంగంగా అతను జగన్ను చాలా విపరీతమైన వ్యాఖ్యాతో విమర్శించినప్పటికీ విషయం పెద్దయ్యేకొద్దీ జగన్ జపం చేస్తూనే ఉన్నాడు.

ఇక ఈ లేఖ విషయానికి వస్తే… మన ప్రభుత్వం 20,64,379 మంది కార్మికుల పేర్లను ఆధార్ తో లింకు చేయాలని సంకల్పించింది. అయితే ఇప్పటివరకు 10,66,265 మంది మాత్రమే లింకయ్యారు. మిగతా కార్మికుల పేర్లను కూడా ఆధార్ తో అనుసంధానం చేసేలా గ్రామ, వార్డు వలంటీర్లకు ఆదేశించండి. 2014 నుంచి 2019 మధ్య కాలంలో బిల్డర్ల నుంచి లేబర్ వెల్ఫేర్ ఫండ్ రూపంలో రూ.1364 కోట్లు వసూలు చేసినా, ఇప్పటివరకు రూ.330 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా నిధులు ఇపుడు బయటకు తీసి ఆదుకోమని రఘురామకృష్ణరాజు కోరారు. 

కాబట్టి ఈయన మళ్లీ జగన్ కు దగ్గర అయ్యేందుకు రాష్ట్రంలోనే సమస్యలను అతని ముందు పెట్టి వీటిని మీరు తప్ప ఎవరూ పరిష్కరించలేరు అని పొగుడుతున్నారా లేదా జగన్ పై ఇంకా తనకు నమ్మకం ఉన్నట్లు జనాలకు చూపిస్తున్నారా…. లేకపోతే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడం లేదని అసలు ఇటువంటి ఎన్నో సమస్యలు ఈ కష్టకాలంలో ప్రభుత్వం కళ్ళకి కనపడటం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా…. అన్నది ఎవరికీ అర్థం కావడంలేదు. ఇక ఈ లేఖకి జగన్ రెస్పాన్స్ మరియు అతని రెస్పాన్స్ కు రాజుగారి సమాధానం చూస్తే మనం కూడా ఒక అంచనాకు వచ్చేయవచ్చు. ఈలోపల ఇంకెన్ని లేఖాస్త్రాలు వస్తాయో…

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju