NewsOrbit
న్యూస్

ధర్మానకు చివరికి మిగిలింది ఇదేనా?

అన్నగారు ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు శిష్యుడుమంత్రి పోయాడు ఇదే శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ ధర్మాన ప్రసాదరావుకు మిగిలింది.ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్.

 

కాంగ్రెస్ లో పలుమార్లు మంత్రిగా చక్రం తిప్పారు. కీలకమైన శాఖలను కూడా చూశారు. ఆ టైంలో అన్న క్రిష్ణ దాస్, కానీ సీదరి అప్పలరాజు కానీ పెద్దగా రాజకీయం ఊసూ ధ్యాసా లేకుండా ఉండి ఉంటారు.

అయితే 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత క్రిష్ణ దాస్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వైఎస్సార్ ద్వారా టికెట్ అందుకున్నారు.  కాంగ్రెస్ కంటే వైఎస్సార్ కుటుంబాన్నే గట్టిగా  నమ్ముకున్నారు.  వైఎస్సార్ దుర్మరణం తరువాత ఆయన నాడే జగన్ కి వీర విధేయుడిగా నిలిచి వెంట నడిచారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిచి వైసీపీ ఎమ్మెల్యేగా  క్రిష్ణ దాస్ ముద్ర వేసుకున్నారు.

నాటి నిబధ్ధతకు ప్రతిఫలాన్నే ఇపుడు ఆయన అనుభవిస్తున్నారు. జగన్ మెచ్చిన నేతగా తొలి విడతలోనే మంత్రిగా అయిన క్రిష్ణ దాస్ ఇపుడు ఉప ముఖ్యమంత్రి కూడా కాబోతున్నారు. ఇక ఆయన వైసీపీ క్యాబినేట్లో  అయిదేళ్ళ మంత్రి అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మరో మంత్రి సీదరి అప్పలరాజు. ఈయన కూడా ప్రసాదరావు శిష్యుడే. గురువు సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా ఉంటే శిష్యుడు  గెలిచిన ఏడాదిలోనే మంత్రి సీటు పట్టేశారు. ఓ విధంగా తాను ఏరి కోరి రాజకీయాల్లోకి తెచ్చిన అన్న గారు, మరో వైపు శిష్యుడు  ఇద్దరూ మంత్రులుగా శ్రీకాకుళం జిల్లాలో ఉండడం కంటే అసలైన ఆనందం ప్రసాదరావుకు వేరే ఉండదని అంతా అంటున్నారు.కానీ ధర్మాన కుటుంబంలో అన్న గారు మంత్రిగా ఉంటే మాజీ మంత్రి తమ్ముడు ప్రసాదరావుకి అవకాశం రాదు అన్నది కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మరి ప్రసాదరావు ఇంతటితో సర్దుకుంటారా లేక ఇ౦కేదైనా ప్రయత్నాలు చేస్తారా అన్నది చూడాలి!

Related posts

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk