NewsOrbit
రాజ‌కీయాలు

ధర్మాన ప్రసాదరావు .. దీ తోపు హీరో .. ఎందుకంటే …!!

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇటీవ‌ల కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. తన అధ్య‌క్ష‌త‌న అమ‌రావ‌తిలో గ‌త నెల‌లో జ‌రిగిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్ స‌మావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.

3 జిల్లాలను 25 జిల్లాలుగా ఏర్పాటు చేయ‌డంతో పాటు అదనంగా అరకును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసే అంశంపై కేబినెట్ స‌మావేశంలో ఆమోదించారు. అయితే, ఈ ప‌రిణామం శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన సీనియ‌ర్ ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మైలేజీని పెంచిందంటున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎస్ నేతృత్వంలో అధికారులతో కూడిన అధ్యయన కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిన అనంత‌రం ఎమ్మెల్యే కీల‌క ప్ర‌తిపాద‌న చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయ‌వ‌ద్ద‌ని ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఏకంగా పార్టీ స‌మావేశంలోనే ప్ర‌క‌టించారు. జిల్లాలోని ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గాన్ని శ్రీ‌కాకుళం ప‌రిధిలోనే ఉంచాల‌ని ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కోరారు. ఆయ‌న డిమాండ్ చేసిన‌ స‌మ‌యంలో హాట్ టాపిక్గా మారిన‌ప్ప‌టికీ, సీఎం జ‌గ‌న్ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు టాక్‌.

ధ‌ర్మాన డిమాండ్ అనంత‌రం దీనికి త‌గు కార‌ణాలు ప్ర‌భుత్వం అధ్య‌య‌నం చేసిన‌ట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయంలో ఎచ్చెర్ల కీలక భూమిక పోషిస్తోంది. ప‌లు ఫార్మా కంపెనీలు ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉన్నాయి. అంబేద్కర్ యూనివర్శిటీ కూడా ఉంది. పలు ప్రైవేట్ రంగ పరిశ్రమలు ఉండ‌టంతో జిల్లాకు ఆదాయవనరుగా ఈ ప్రాంతం ఉంది. దీన్ని విజయన‌గరానికి ఇచ్చేస్తే సిక్కోలు జిల్లాకు ఇక్కట్లు తప్పవన్న ఫీడ్ బ్యాక్ రావ‌డంతో సీఎం జ‌గ‌న్ త‌న నిర్ణ‌యం ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు సమాచారం.

మ‌రోవైపు, ధ‌ర్మాన సోద‌రుడైన మంత్రి కృష్ణ‌దాస్ సైతం ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్ వ‌ద్ద ఎచ్చెర్ల ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేశార‌ని స‌మాచారం. ఉప‌ముఖ్య‌మంత్రి, రెవిన్యూ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం ఆయ‌న జిల్లా అభివృద్ధికి ఎచ్చెర్ల స‌హ‌క‌రించే విధానం, ఆ నియోజ‌క‌వ‌ర్గం జిల్లా ప‌రిధి మార్చ‌డం వ‌ల్ల ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జ‌గ‌న్ సిక్కోలులోనే ఎచ్చెర్ల ఉంచేందుకు డిసైడ‌య్యారట‌. మొత్తంగా ధ‌ర్మాన బ్ర‌ద‌ర్స్ వ‌ల్ల సిక్కోలుకు గుండెకాయ వంటి నియోజ‌క‌వ‌ర్గం అక్క‌డే ఉంద‌ని అంటున్నారు.

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju