NewsOrbit
న్యూస్

టిడిపిలో వృద్ధ సింహాలు సరే ! రేసుగుర్రాలు ఏవి బాబూ!

అధికారంలో ఉన్న వైసిపిలో యువత గుభాళి స్తుంటే ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ముసలి వాసన కొడుతోందని రాజకీయ పండితులు భావిస్తున్నారు.

Elderly lions in TDP OK What are the racehorses Babu
Elderly lions in TDP OK What are the racehorses Babu

 

వైసీపీ బలోపేతం కావడానికి టిడిపి రోజురోజుకీ బలహీన పడటానికి కారణం ఇదేనని కూడా వారు విశ్లేషిస్తున్నారు. వైసీపీ విషయానికొస్తే ముఖ్యమంత్రి జగన్ కే యాభై ఏళ్లు లేవు. ఇక ఆ పార్టీ ఎమ్మెల్యేలలో మెజారిటీ శాసనసభ్యులు కుర్రోళ్ళు. మొత్తంమీద చూస్తే వైసీపీ లో యంగ్ బాచి అధికం. టిడిపి లో చూస్తే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి డెబ్బై ఏళ్లు దాటాయి.పత్రికా పార్టీలో కీలక పాత్ర పోషించే యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య ,గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులంతా కూడా వయోధికులే.

చిన్న బాబు లోకేష్ కుర్రాడే.. కాదనలేం.. కానీ అతనికి వైసీపీని తట్టుకునే శక్తి సామర్థ్యాలు లేవని ఎప్పుడో రుజువు అయిపోయింది. ఈ పరిస్థితుల్లో టిడిపి ఎలా మనుగడ సాగిస్తుందా అన్నది ప్రశ్నార్థకం. యువతను టిడిపిలో యాక్టివ్ చేస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది అన్నది రాజకీయ పరిశీలకులు సూచన. నిజానికి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు చాలామంది తమ వారసులను రాజకీయ రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకదశలో లోకేష్ బాబు కూడా పార్టీ లో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇందుకోసం చంద్రబాబు నాయుడు లోకేష్ కలిసి పార్టీలోని యువ నాయకులకు ఒక విందు కూడా ఇచ్చారు.

ఈ విందుకు పెద్ద సంఖ్యలో టిడిపి యువ నాయకులు కుటుంబ సమేతంగా హాజరై చంద్రబాబు లోకేష్తో కలిసి సెల్ఫీలు కూడా తీసుకున్నారు.దీంతో పార్టీని గట్టున పడేసే ప్రయత్నాలు మొదలయ్యాయని పరిశీలకులు భావించారు.అయితే అంతటితోనే ఆ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ లోకేష్ నుంచి ఏ మాట మంతీ లేకపోవడంతో టిడిపి యువ నేతలు సైలెంట్ అయిపోయారు. ఈ లోపు వైసీపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది. టిడిపి మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ,మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి చింతమనేని ప్రభాకర్ తదితరులను వేరే వేరే కేసుల్లో జైలుకు సైతం పంపింది.దీంతో టిడిపి యువనాయకులు మరీ భయపడిపోయారు.

పెద్ద పెద్ద నాయకులకే దిక్కులేదు …మనకెందుకు అన్నట్లు వారు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. పైగా జగన్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా తీవ్ర స్థాయిలో రియాక్షన్ వుంటోంది.ఇలాంటి పోస్టులు పెట్టారన్న అభియోగంపై చాలామంది టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలను కూడా జగన్ ప్రభుత్వం అరెస్టు చేయించింది.ఇది కూడా టిడిపి యువనాయకులకి భయాన్ని కలిగించింది.ఈ నేపథ్యంలో టిడిపిలోని కుర్రోళ్లు ఇళ్లకు పరిమితమయ్యారు.వృద్ధ నాయకులే జగన్ ప్రభుత్వానికి ఎదురీదుతున్నారు.ఈ పరిస్థితిని కనుక సరిదిద్దకపోతే 2024 ఎన్నికల నాటికే టిడిపి దుకాణం కట్టేసుకోవాల్సివస్తుందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?