NewsOrbit
న్యూస్ సినిమా

ప్రభాస్ తెలుగోడు ఐనా నరేంద్రమోదీకి ఫేవరెట్ హీరో.. ఎందుకో తెలుసా?

hero prabhas following foot steps pm narendra modi

ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన జీవితం దేశ ప్రజల కోసమేనని ఆయన ఎప్పుడో చెప్పారు. రాజకీయాలకే తన జీవితాన్ని అంకితం చేశారు. దేశ ప్రజల కోసం, బీజేపీ పార్టీ కోసం తన కుటుంబానికి కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. ఇప్పుడే కాదు.. చాలా సంవత్సరాల క్రితమే ఆయన తన కుటుంబాన్ని వదిలేశారు. ప్రస్తుతం ఆయన జీవితం దేశానికే అంకితం.

hero prabhas following foot steps pm narendra modi
hero prabhas following foot steps pm narendra modi

ఇక.. అసలు విషయానికి వద్దాం.. బాహుబలి వీరుడు ప్రభాస్ కూడా ప్రధాని మోదీ బాటలోనే నడవాలని ఫిక్స్ అయ్యాడట. అంటే.. కొంపదీసి ప్రభాస్ రాజకీయాల్లోకి వస్తున్నాడా? బీజేపీలో చేరుతున్నాడా? అని ఆవేశపడకండి.. ఆయన బాటలో అంటే… ప్రధాని మోదీ ఎలాగైతే తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం ఇచ్చారో… ప్రభాస్ కూడా తన జీవితాన్ని సినిమాలకు అంకితం ఇద్దామనుకుంటున్నాడు.

ఎలాగూ ప్రభాస్ సినీరంగంలో ఫుల్ సక్సెస్. ప్రస్తుతం ఆయన నేషనల్ స్టార్. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నాడు. భారీ ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. ఇలాగే ఫుల్ టైమ్ సినిమాలకే కేటాయించాలని ప్రభాస్ భావిస్తున్నాడట.

నిజానికి ప్రభాస్ కంటే తక్కువ వయసు ఉన్న కుర్ర హీరోలంతా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటీవలే నితీన్ కూడా పెళ్లి చేసుకున్నాడు. కానీ.. మూడు పదుల వయసు దాటినా ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి గురించి మాట్లాడటం లేదు. ఆయనే కాదు.. తన కుటుంబ సభ్యులు కూడా ప్రభాస్ పెళ్లి విషయాన్ని ఎత్తడం లేదు. అంటే ప్రభాస్ ఇప్పట్లో పెళ్లి చేసుకోడా? అంటే చేసుకోడు అని ఆయన ఒప్పుకున్న సినిమాలే చెబుతున్నాయి.

ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలు పూర్తికావడానికే రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుంది. ఈ గ్యాప్ లో మరే సినిమాలు ఒప్పుకుంటూ వెళ్తుంటే ఇక పెళ్లి చేసుకునే సమయం ఎక్కడిది. అందుకే.. ప్రధాని మోదీని ప్రభాస్ ఫాలో అయిపోతున్నాడు.. అంటూ ఫిలింనగర్ టాక్.

మరోవైపు ఇఫ్పుడిప్పుడే పాన్ ఇండియా ఇమేజ్ ప్రభాస్ కు వస్తోంది. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్లడమే ధ్యేయంగా ప్రభాస్ ఉన్నట్టు తెలుస్తోంది. బాహుబలితోనే ప్రభాస్ కు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. కానీ.. ఆ తర్వాత వచ్చిన సాహో.. అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ.. తన తదుపరి సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండేటట్టు చూసుకుంటున్నాడు. వరుసగా రెండు మూడు పాన్ ఇండియా సినిమాలు తీస్తే.. పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో పాటు.. పర్మినెంట్ గా నేషనల్ స్టార్ గుర్తింపు ఉంటుందని ప్రభాస్ భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

Related posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju