NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

వైయస్సార్ మరణం..! ఇప్పటికీ తీరని అనుమానాలెన్నో..!!

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం ఎలా జరిగింది అన్నది అందరికీ తెలిసిందే. దాని గురించి ఎన్నో కధలు కథలుగా చెప్పుకున్నాం. అయితే ఆ మరణం వెనుక అనేక అనుమానాలు మిగిలిపోయాయి. ఎన్ని సంవత్సరాలు గడిచినా, దశాబ్దాలు గడిచినా ఈ అనుమానాలకు నివృత్తికావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ కోర్టులు ఈ అనుమానాలు తీర్చే ప్రయత్నం చేయడం లేదు. అంటే బయట వైఎస్ అభిమానులు, వైఎస్ కుటుంబీకులు, వైఎస్ బంధువర్గం, స్నేహితులు కాకుండా వైఎస్ భార్య విజయమ్మకు కనీసం తన భర్త మరణం పట్ల ఉన్న అనుమానాలు ఇప్పటికీ నివృత్తి కాలేదు. ఇటీవల విజయమ్మ రాసి విడుదల చేసిన నాలో నాతో వైఎస్ఆర్ పుస్తకంలో వైఎస్ఆర్ మరణం పట్ల విజయమ్మ వ్యక్తం చేసిన అనుమానాలు మరో సారి ప్రస్థావించుకుందాం.

 

 

విజయమ్మ వ్యక్తం చేసిన అనుమానాలు ఇవే…

* కొన్నాళ్లు గడిచాక పేపర్లలో, టీవిల్లో ఈ దుర్ఘటనకు సంబంధించి రకరకాల కథనాలు చూసి, ఆప్తులందరూ నా దగ్గరకు వచ్చి వాటి గురించి చెప్పేవారు. అవి విన్నప్పుడల్లా నాకూ అనిపించేది…అసలు ఇన్ని తప్పులు ఒకే రోజు ఎలా జరుగుతాయి?ఈ దుర్ఘటన అంత నివారించలేనిదా? కాస్త జాగ్రత్తపడుంటే దీన్ని ఆపలేకపోయేవాళ్లమా?అని !

* రానురాను ఎన్నో విషయాలు బయటికొచ్చాయి… పాత చాపర్ బాగోలేదని తెలిసి అదే ఎందుకు పెట్టినట్లు? వాతావరణం అస్సలు బాగాలేదని తెలిసి కూడా పైలట్ ఎందుకు వెళ్లాలనుకున్నట్టు… ఆ నిర్ణయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు ఎందుకు నియంత్రించలేకపోయినట్టు… చాపర్‌ను గాల్లోనే రెండున్నర గంటలు నిలబెట్టగల ప్యూయల్ వున్నా ఎందుకలా చేయనట్టు… ఏమీ లేక పోతే వెనక్కి తిరిగి ఎందుకు రానట్టు… ఒక సిఎం (వైఎస్) ఫ్లైట్ రాడార్ నుంచి మిస్సయితే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు అంత తేలిగ్గా ఎలా తీసుకున్నట్టు… ఫ్లైట్ గమ్యస్థానానికి చేరలేదని తెలిసిన కొన్ని గంటల దాకా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ ఎందుకు మొదలెట్టనట్టు… అసలు బ్లాక్ బాక్స్‌లో ఉన్న మాటలేంటో పూర్తిగా ఎందుకు బయటపెట్టనట్టు… ఇలాంటి ఎన్నో అనుమానాలకు సమాధానాలు లేవు.

* అసలు పైలట్ వద్ధంటున్నా ఈయనే (వైఎస్) పొమ్మన్నారని కొంత మంది అన్నారు కానీ, నేనైతే దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే, ఈయన (వైఎస్) ఇంకొకళ్ల పనిలో తలదూర్చే మనిషి కాదు. తనొక డాక్టరయ్యి ఉండీ వేరే డాక్టర్లకే సలహా ఇచ్చేవారు కాదు… ‘ఎవరి పనులు వాళ్లని చేయ్యనిస్తేనే వాళ్లకు కాన్ఫిడెన్స్ ఉంటుంది’ అని! అలాంటిది ఒక పైలట్‌కి తనకు తెలియని దాన్లో సలహాలు ఇస్తారా? పొరపాటున కూడా ఇవ్వరు!

* బయలుదేరే ముందు నాతో అన్నారు కూడా –  “పైలట్ పోనిస్తే పోతా, లేకపోతే లేదు” అని! అక్కడిదాకా ఎందుకు… ఇంతకు ముందు ఈయన(వైఎస్) తో కలిసి నేను రెండుమూడు సార్లు అలా వెళ్లినప్పుడు, సరిగ్గా బయలుదేరే టైంలో పైలట్ ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్పగానే, ఈయన – ‘థాంక్ గాడ్, బయలుదేరక ముందు చెప్పారు’ అని ఫ్లైట్ దిగేశారు. కాబట్టి, ఇప్పుడు కూడా పైలట్ ‘వద్దు’ అని ఉంటే, ఈయన(వైఎస్) ఎట్టి పరిస్థితుల్ల వెళ్దామనేవారు కాదు.

* ఇవన్నీ ఆలోచిస్తుంటే…ఎవరో ఏదో చేశారనే అనుమానమైతే మా అందరికీ ఖచ్చితంగా కలిగింది. ఎందుకంటే ఈయన(వైఎస్) కి ప్రాణమిచ్చే వీరాభిమానులు ఎలా ఉన్నోరో, అంతకంత బలమైన శత్రువులు కూడా ఉన్నారు. ఒక వేళ ఇది కుట్రే అయినా, అదీ తెలియాల్సిన అవసరం ఉంది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju