NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఇళ్ల పట్టాలపై మరో వివాదం…! ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్..!!

 

వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ కు పలు కీలక నిర్ణయాల విషయంలో ఏపి హైకోర్టు నుండి షాక్ లు తగలడం పరిపాటిగా మారింది. హైకోర్టుకు వెళుతున్న అనేక అంశాలలో ఒకటి రెండు మినహా దాదాపు అత్యధిక విషయాల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. నేడు తాజాగా రాజమహేంద్రవరం వైశ్వ సేవా సదన్ భూములను ఇళ్ల పట్టాలుగా ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది.

ap high court

ఏపి హైకోర్టులో శుక్రవారం రాజమహేంద్రవరం వైశ్య సేవా సదన్ భూములను ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీకి తీసుకున్న నిర్ణయంపై విచారణ జరిగింది. 1922లో తెలుగు, సంస్కృతం అభివృద్ధి, వైశ్య పేద మహిళల సహాయం చేయడం కోసం ఈ వైశ్య సదన్ ఏర్పడినట్లు పిటిషనర్ తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్ తరపున వాదనలు విన్న హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని వైశ్యసదన్ కు నోటీసులు జారీ చేస్తూ కేసు విచారణను అక్టోబర్ నెలకు వాయిదా వేసింది.

ఈ సందర్భంగా పిటిషనర్ తరుపు న్యాయవాది మాట్లాడుతూ వైశ్య సదన్ కు దాదాపు 500 ఎకరాల భూముల్లో అనేక భవనాలను, కాలేజీలను, ఆలయాలు ఇవన్నీ ఏర్పాటు చేశారని చెప్పారు. వీటిపై వచ్చే ఆదాయంతోనే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సేవా సదన్ కు సంబంధించిన 32 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీకి తీసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టగా మార్చి 16 న దేవాదాయ శాఖ కమిషనర్ ఈ భూములను తీసుకోవడానికి వీలు లేదని, హైకోర్టు తీసుకోవద్దని చెప్పిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారని తెలిపారు. ఈ వివరాలు ఇచ్చినా ప్రభుత్వం గానీ, అధికారులు గానీ పట్టించుకోకుండా ముందుకే వెళుతున్నారని ఈ నేపథ్యంలో ఒ ప్రముఖుడు పిల్ దాఖు చేయగా నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కి విచారణకు వచ్చిందన్నారు. హైకోర్టు తమ వాదనలు అన్నీ విని ప్రభుత్వం నిర్ణయంపై స్టే ఇచ్చిందని తెలిపారు.

ఇటీవలే ఒకే రోజు హైకోర్టులో ఆరేడు కీలక అంశాలపై హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారులు అనాలోచితంగా, రాబోయే న్యాయపరమైన చిక్కులను పరిశీలించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వం ఇరుకున పడే పరిస్థితి ఏర్పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju