NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

16 నెలల పాలన తర్వాత జగన్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్..!!

వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయి 16 నెలలు కావస్తోంది. పరిపాలన పరంగా సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగకుండా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ వస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంక్షేమ పథకాలు కంటిన్యూ చేశారు. అంతా బాగానే ఉన్నా కానీ జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆయనకు పెద్ద బిగ్గెస్ట్ చాలెంజ్ గా మారినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే వైయస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలలో ఒక నిర్ణయం మూడు రాజధానులు.

Hospitals watering down Aarogyasri must face action, says Andhra Pradesh CM Jagan Mohan Reddy- The New Indian Expressఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం అభివృద్ధి అనేది అంతట జరగాలని. అంతేకాకుండా అమరావతిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గతంలో అవినీతి చేసిందని అనేక ఆరోపణలు చేశారు. దీంతో చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అంటూ ఒక నివేదిక కూడా అప్పట్లో రెడీ చేయడం జరిగింది. ఈ తరుణంలో మంత్రి వర్గం అందించిన నివేదికలో 4050 ఎకరాలు బినామీ పేర్లతో రాజధాని అమరావతి ప్రాంతంలో టిడిపి అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించడం జరిగింది. ఇదే విషయాన్ని నిండు అసెంబ్లీలో కూడా వైఎస్ జగన్ ప్రస్తావించారు.

 

ఇటువంటి తరుణంలో ప్రస్తుతం రాష్ట్రంలో రాజధాని విషయంలో రగడ జరుగుతున్న నేపథ్యంలో అవినీతి జరిగితే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న వాదనలు వస్తున్నాయి. మొదటిలో ఏపీ సిఐడి అధికారులు విచారణ చేస్తున్నట్లు అప్పట్లో కొంతమంది బాబు హయాంలో పని చేసిన అధికారులను విచారణ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. తెల్ల రేషన్ కార్డు దారులు అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు కొన్నట్లు వాళ్ళంతా టిడిపి పార్టీకి చెందిన పెద్దపెద్ద నాయకుల బినామీలు అన్నట్లు అప్పట్లో ప్రభుత్వం గుర్తించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.

 

నిజంగా రాజధాని అమరావతి విషయంలో అవినీతి జరిగి ఉంటే జగన్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తాజాగా విపక్షాల నుండి కామెంట్లు వస్తున్నాయి. నిజంగా ఈ విషయంలో జగన్ చర్యలు తీసుకుంటే బిజెపి అడ్డుపడుతుంది అన్న భయం ఏమైనా ఉందా అనే వాదన మరోపక్క వినబడుతుంది. ముఖ్యంగా అమరావతి రాజధాని రైతులు చేస్తున్న దీక్షకు ఇప్పుడు అరెస్టులు అని ప్రభుత్వం ముందుకు వెళ్తే అగ్గి రాజేసినట్లు  అవుతుందని ప్రభుత్వం భావిస్తోందా…? అనే వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా పదహారు నెలల పాలన తర్వాత అమరావతి రాజధానిలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవటం వైఎస్ జగన్ సర్కార్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా ఉంది అని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N