NewsOrbit
రాజ‌కీయాలు

జగన్ ను రాజకీయంగా ముంచుతున్న హరీశ్ రావు మాటలు..!

harish rao irksome jagan with his statements

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత మంచి స్నేహితులో తెలిసిందే. చంద్రబాబుపై వీరిద్దరికీ ఉన్న ఉమ్మడి శత్రుత్వమే వీరి స్నేహానికి నాంది అయ్యేలా.. 2019 ఎన్నికల్లో జగన్ కు కేసీఆర్ పూర్తిగా మద్దతిచ్చేలా చేసింది. జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరుకావడం, స్టాలిన్ ను తీసుకురావడం.. జరిగింది. అయితే.. ప్రస్తుతం వీరిద్దరి మధ్య కేంద్రం నిర్ణయాలు వైరం పెంచుతున్నాయి. రాజకీయ అవసరాలు, కేసుల నేపథ్యంలో జగన్ కేంద్రానికి జై కొడుతుంటే.. కేసీఆర్ మాత్రం సై అంటే సై అంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యలు ఏపీలో ప్రజలను ఆలోచించేలా చేస్తున్నాయి. ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతున్నాయి.

harish rao irksome jagan with his statements
harish rao irksome jagan with his statements

ప్రభుత్వం మాటల కంటే హరీశ్ మాటలకే ప్రాధాన్యం..

రీసెంట్ గా హరీశ్ మాట్లాడుతూ.. కేంద్రం ఇస్తానన్న 4వేల కోట్లకు కక్కుర్తి పడి సీఎం జగన్ రైతుల వ్యవసాయ మోటర్లకు ఉచిత మీటర్లు బిగించేందుకు ఒప్పుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు 2500 కోట్లు ఇస్తామంటే రైతులకు అది మంచిది కాదు అంటూ.. కేసీఆర్ వ్యతిరేకంగా వెళ్తున్నారని అన్నారు. నిజానికి తెలంగాణ నాయకులకు ఏపీలో ఫాలోయింగ్ బాగానే ఉంది. వాళ్ల మాటలకు రాజకీయ అభిమానులు ఏపీలో ఉన్నారు. ఈక్రమంలో హరీశ్ చేసిన వ్యాఖ్యలను ఏపీలో జగన్ అనుకూల, వ్యతిరేక వర్గాలు నిశితంగా గమనించాయి. ముఖ్యంగా ఉచిత వ్యవసాయ మీటర్లపై రైతులను ఒప్పించే దిశగా వెళ్తున్న ఏపీ ప్రభుత్వానికి హరీశ్ వ్యాఖ్యలు ఆటంకంగా మారాయి.

వైసీపీ బలంగా ఉన్న చోటే రైతుల్లో వ్యతిరేకత..

రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉన్నది రాయలసీమలో. అక్కడే ఈ అంశంపై వ్యతిరేకత వస్తోంది. భవిష్యత్తులో ఉచితం తీసేస్తారని.. రాయితీలు తగ్గించేస్తారని రైతుల్లో అపోహలు ఉన్నాయి. కేంద్రం గతంలో నగదు బదిలీలో భాగంగా లబ్దిదారులను తగ్గించినట్టే ఇప్పుడు కూడా చేస్తారని ఓ వాదన ఉంది. ఇదే జరిగితే రాయలసీమలో ఉచిత వ్యవసాయ విద్యుత్ పై ఆధారపడి ఉన్న రైతులకు కష్ట కాలమే. అసలే వర్షాలు తక్కువ.. కరువు ఎక్కువ. ఈక్రమంలో రైతులకు ఈ మీటర్ల బిగింపు తలనొప్పిగా మారుతోంది. జగన్ బలంగా ఉన్న రాయలసీమలో ఇది ఇబ్బందికర పరిణామమే.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?