NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

స‌బ్బం హ‌రి…ప్ర‌పంచ మేధావి బిల్డ‌ప్‌.. ఆకు రౌడీ లాంటి ప‌నులు

స‌బ్బం హ‌రి…. విశాఖ రాజ‌కీయాల్లోని ముఖ్య నేత‌ల్లో ఒక‌రు. అయితే, తాజాగా ఆయ‌న ఊహించ‌ని రీతిలో వివాదంలో చిక్కుకుంటున్నారు. ఈ వివాదం ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మెడ‌కు చుట్టాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి.

రాజ‌కీయ విమ‌ర్శ‌లు జ‌రిగాయి. అయితే, దీనిపై వైసీపీ నేత‌, పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాసరావు) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను, విజయసాయిరెడ్డిపై  టీడీపీ నేత సబ్బం హరి ఒక వీధి రౌడీ, ఆకు రౌడీలా మాట్లాడిన వ్యక్తిగత దూషణలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని వ్యాఖ్యానించారు.

అస‌లు స‌బ్బం హ‌రిని ఎవ‌రు ప‌ట్టించుకుంటారు?

త‌న‌‌ మీద పోటీ చేసి ఓడిపోయిన సబ్బం హరి గురించి ఎవరూ పట్టించుకోరని అవంతి శ్రీ‌నివాస్ వ్యాఖ్యానించారు. “స‌బ్బం హ‌రి గురించి పట్టించుకోవాల్సిన అవసం కూడా ఎవరికీ లేదు. ఆయన గురించి ఆయనే ఎక్కువగా ఊహించుకుని.. ఎక్కువ మాట్లాడుతున్నాడు. సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఎంపీగా పనిచేసిన వ్యక్తి.. ఈరోజు ఒక వీధి రౌడీలా మాట్లాడాడు, ఒక కార్పొరేటర్  స్థాయి వ్యక్తి కూడా అలాంటి భాష మాట్లాడడు. సబ్బం హరి మాట్లాడితే.. దానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, టీడీపీ నేతలు బండారు సత్యనారాయణ, అయ్యన్నపాత్రుడు.. వీళ్ళంతా ఆయనకు మద్దతుగా మాట్లాడటం, వాటిపై మీడియాలో ఇస్తున్న కవరేజ్ చూస్తే.. దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన గాంధీ గారి గురించి నిన్న గాంధీ జయంతి రోజున కూడా ఇవ్వని కవరేజ్ ఇస్తూ.. విశాఖలో, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ఓ వర్గం మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారు.“ అంటూ మండిప‌డుతున్నారు.

ఆకు రౌడీవా… వీది రౌడివా?

వళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సబ్బం హరిని హెచ్చరిస్తున్నామ‌ని అవంతి శ్రీ‌నివాస్ అన్నారు. “మీరు ఏమన్నా ఆకు రౌడీ, వీధి రౌడీ అనుకుంటున్నారా.. రాజకీయాల్లో ఉంటే.. సహేతుకమైన విమర్శలు చేయాలి. నోరు ఉందని అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం. సబ్బం హరికి చెందిన ఒక్క ఆక్రమణను మాత్రమే కొట్టేయలేదే..?. విశాఖ నగరంలో మొత్తం 450 మందివి కొట్టేసినప్పుడు నోరు మెదపకుండా.. మీ దగ్గరకు వచ్చే సరికి రోడ్డు మీదకు వచ్చి పులివేషాలు వేస్తే చూస్తూ ఎవరూ ఊరుకోరు. “ అని ప్ర‌శ్నించారు. “ఈ ప్రభుత్వానికి ఎవరిమీదా, ఏ విధమైన కక్ష సాధింపులు లేవు. సబ్బం హరి మీద కూడా ఎటువంటి కక్ష లేదు.  అంతెందుకు, ఇటీవల మా పార్టీ నాయకుడి మీద భూ ఆక్రమణల ఆరోపణలు వస్తే పార్టీ సస్పెండ్ చేసింది.“ అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

అస‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఏం అవ‌స‌రం?

త‌మ ప్ర‌భుత్వానికి ఎలాంటి విధ్వంసం చేయాల్సిన అవసరం లేదని అవంతి శ్రీ‌నివాస్ తెలిపారు. “భూ ఆక్రమణలు ఏమైనా ఉంటే.. వాటిని తొలగించాలని అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. లా అందరికీ సమానమే. ఎవరూ అతీతం కాదు. రాజకీయ నాయకులు ఎక్కువ కాదు. ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం.  కబ్జాలు, అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తాం. తన, మన అన్న తేడా లేదు. ఎవరికైనా ఒకటే న్యాయం. మీడియా కూడా విచక్షణ చూపాలి. సబ్బం హరి ఆక్రమణ విషయంలో.. తప్పు జరిగిందా.. లేదా అన్నది కూడా చూడాలి. ఆయన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారా లేదా.. అన్నది చూడాలి. “ అని ప్ర‌క‌టించారు. ఆక్రమణలు ముట్టుకుంటే కక్ష సాధింపని చంద్రబాబు, టీడీపీ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు అని అవంతి పేర్కొన్నారు.

ఆయ‌నో ప్ర‌పంచ మేధావి

పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ… “సబ్బం హరి టీవీ చర్చల్లోగానీ, మీడియా సమావేశాల్లోగానీ ఆయన మాట్లాడే విధానం చూస్తే.. ఆయనేదో ప్రపంచ మేధావి అన్నట్లు బిల్డప్ ఇస్తూ మాట్లాడతాడు. అసలైన వ్యక్తిత్వం ఎప్పుడు బయటపడుతుంటే.. తప్పు చేసి అడ్డంగా దొరికిపోయినప్పుడు, ఆ తప్పు నుంచి బయటపడేందుకు బుకాయించేటప్పుడు కనిపిస్తుంది. అదే ఈరోజు సబ్బం హరి మాటల్లో కనిపించింది“ అని వ్యాఖ్యానించారు.

Related posts

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?