మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన ఆహారాన్ని తీసుకోవాలి. చాలా మంది వ్యాయామం సరిగ్గా చేసినప్పటికీ నిత్యం పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారాన్ని నిత్యం తీసుకోవాలన్న విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. మన ఆరోగ్యం విషయంలో పౌష్టికాహారం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలోనే నిత్యం కింద తెలిపిన పలు సూపర్ ఫుడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి ఆ సూపర్ ఫుడ్స్ ఏమిటంటే..
1. ఓట్స్
ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్ విషయానికి వస్తే ఓట్స్ ఉత్తమమైన ఆహారం అని చెప్పవచ్చు. వీటిలో మన శరీరానికి రోజు మొత్తంలో సరిపోయే పోషకాలు ఉంటాయి. అలాగే ఎక్కువగా ఆకలి కాకుండా ఉంటుంది. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే ఓట్స్‌లో ఉండే ఫైబర్, విటమిన్లు, మినరల్స్ షుగర్ లెవల్స్‌ను అదుపు చేస్తాయి. చర్మాన్ని రక్షిస్తాయి. మలబద్దకం రాకుండా ఉంటుంది.
2. యాపిల్స్
నిత్యం ఒక యాపిల్‌ను కచ్చితంగా తీసుకోవాలి. దీంట్లో ఉండే ఫైబర్ జీర్ణాశయంలో మంచి బాక్టీరియాను పెంచుతుంది. ఫుడ్ పాయిజనింగ్ కాకుండా చూస్తుంది. అనారోగ్యంగా ఉన్నవారు ఈ పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. నిత్యం ఒక యాపిల్‌ను తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
3. క్యారెట్లు
యాపిల్ పండ్లలాగే క్యారెట్లు కూడా సూపర్ ఫుడ్స్ జాబితా కిందకు వస్తాయి. వీటిని నిత్యం తీసుకోవాలి. వీటిల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది.
4. ఎగ్స్
కోడిగుడ్లను నిత్యం తీసుకోవడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది. గుడ్డులో ఉండే ప్రోటీన్లు మనకు ఎంతో మేలు చేస్తాయి. వాటి వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.
5. గ్రీన్ టీ
నిత్యం గ్రీన్ టీని తాగడం అలవాటు చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. దీంతో బరువు తగ్గవచ్చు. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.