NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4: బిగ్ బాస్ లో లీకుల రాజా ఎవరు? అన్నీ ముందే ఎలా తెలిసిపోతున్నాయి?

everything is leaked before the show in bigg boss 4 house

మొదట్లో కాస్త చప్పగా అనిపించినా.. బిగ్ బాస్ 4వ సీజన్ ప్రారంభమైన రెండు వారాల తర్వాత ఊపందుకుంది. హౌస్ లో గొడవలు, ప్రేమలు స్టార్ట్ అవడంతో ప్రేక్షకులు కూడా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసినా బిగ్ బాస్ గురించే చర్చ. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వారం ఎవరు కెప్టెన్ అవుతారు? వాళ్లిద్దరి మధ్య ఏముంది? వాళ్లిద్దరే ఎప్పుడూ ఒంటరిగా ఎందుకు గడుపుతున్నారు? ఇలా రకరకాల చర్చలు చేసుకుంటున్నారు బిగ్ బాస్ అభిమానులు.

everything is leaked before the show in bigg boss 4 house
everything is leaked before the show in bigg boss 4 house

అయితే.. బిగ్ బాస్ అంటేనే సస్పెన్స్. తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో? ఎవరు కెప్టెన్ అవుతారో? ఆ క్షణం వరకు హోస్ట్ నాగార్జునకు కూడా తెలియదని చెబుతుంటారు. అంత వరకు బాగానే ఉన్నా.. బిగ్ బాస్ కు సంబందించిన అప్ డేట్స్ అన్నీ.. అంటే ఎపిసోడ్స్ కు సంబంధించిన విషయాలన్నీ ముందే సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి.

ఉదాహరణకు.. తాజాగా జరిగిన కెప్టెన్సీ టాస్కే తీసుకుంటే.. ఆ ఎపిసోడ్ ప్రసారం అయింది గురువారం రాత్రి. గురువారం రాత్రి టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ వల్ల సొహైల్ కెప్టెన్ అయ్యాడని తెలిసింది కానీ.. సొహైల్ కెప్టెన్ అని ఒక రోజు ముందే.. అంటే బుధవారమే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ఒక్క విషయమే కాదు.. ఎలిమినేషన్ కు సంబంధించి కూడా గత వారం స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అవుతోందని.. గత శుక్రవారమే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అనుకున్నట్టుగానే శనివారం స్వాతి ఎలిమినేట్ అయింది.

కుమార్ సాయి విషయంలోనూ అదే జరిగింది. సూర్యకిరణ్, కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి.. ఎలిమినేట్ అవుతారని.. ఒకరోజు ముందే సోషల్ మీడియా కోడై కూసింది.

everything is leaked before the show in bigg boss 4 house
everything is leaked before the show in bigg boss 4 house

అయితే.. బిగ్ బాస్ షోకు లీకుల బెడద ఇప్పుడే ఉన్నది కాదు.. రెండో సీజన్ నుంచి ఈ లీకుల బెడద ఎక్కువైంది. మొదటి సీజన్ లో అంతగా లీకుల గొడవ లేదు కానీ.. రెండో సీజన్ నుంచి సోషల్ మీడియాను అస్త్రంగా ఉపయోగించడం స్టార్ట్ చేశారు. అప్పుడే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఆర్మీలు అంటూ గ్రూపులు ఏర్పడటం ప్రారంభం అయింది. అలాగే లీకులు కూడా అప్పుడే ప్రారంభం అయ్యాయి. అవి ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. మూడో సీజన్ లోనూ లీకుల బెడద బిగ్ బాస్ నిర్వాహకులను కాస్త ఇబ్బంది పెట్టినా.. లీకుల నుంచి తప్పించుకునేందుకు మూడో సీజన్ లో బాగానే కష్టపడ్డారు. కానీ.. నాలుగో సీజన్ లో మాత్రం లీకుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు.

బిగ్ బాస్ తెర వెనుక జరిగేది ఇదే

అయితే.. బిగ్ బాస్ హౌస్ తెర వెనుక జరిగేది ఏంటంటే.. ఒక రోజు ముందు జరిగిన దాన్ని తెల్లారి ఎపిసోడ్ గా వేస్తుంటారు. అంటే సోమవారం హౌస్ లో జరిగిన దాన్ని మంగళవారం రాత్రి ఎపిసోడ్ లో ప్రసారం చేస్తారు. మంగళవారంది బుధవారం.. అలాగే వీకెండ్ షోకు సంబంధించి.. శనివారం ఎపిసోడ్ ను శుక్రవారమే షూట్ చేస్తారు. ఆదివారం షోది శనివారమే షూట్ చేస్తారు.

ఒకరోజు ముందుగానే వీటి షూటింగ్స్ పూర్తవుతుండటంతో.. బిగ్ బాస్ లో పనిచేసే వారిలోనే కొందరు కావాలని వాటిని సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లీక్ కాకుండా.. బిగ్ బాస్ నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా.. లీకులు మాత్రం ఆగకపోవడంతో ఏం చేయాలో తెలియక.. ఆ లీకుల రాజాలు ఎవరో తెలియక.. తల పట్టుకొని కూర్చున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju