NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

అధ్యక్షుడిగా అచ్చెన్నే ఎందుకుండాలి..!? బాబు గమ్మత్తయిన స్కెచ్చులు..!!

హమ్మయ్య టీడీపీలో ఓ తతంగం పూర్తయింది..! చాలా కాలంగా ఓ డోలు పట్టుకుని.., ఎవరి మేడలో కట్టాలా అని ఎదురు చూసిన చంద్రబాబుకి అచ్చెన్నాయుడు దొరికారు. వేశారు. ఇక చిన్నా చితక గంటలన్నీ పిల్లులకు కట్టేశారు..! ఇదేదో టీడీపీని కించపరచడానికో.., చంద్రబాబుని తక్కువ చేయడానికో చెప్తున్న మాటలు కాదండోయ్..! ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా అలా చెప్పుకోవాల్సిందే..!! ఇక ఆ డోలుని అచ్చెన్న ఎన్నాళ్ళు వాయిస్తారో..? ఆ పిల్లులు మేడలో గంటలతో ఎన్నాళ్ళు నెట్టుకొస్తాయో..? అన్నీ కలిసి ఎప్పుడు తమ యజమానిని (అధినేతని) కుర్చీ ఎక్కిస్తాయో..!?

బాబు మర్మం మామూలు కాదు సుమీ..!!

చంద్రబాబు అంటే ఒక కన్నింగ్. అందరూ అపర చాణక్యుడు, అపార వ్యూహకర్త అంటుంటారు కానీ.., వాస్తవానికి ఆయన బీభత్సమైన కన్నింగ్. ఒక నిఖార్సయిన పొలిటిషన్. ఇంకా చెప్పుకోవాలంటే పొలిటికల్ వంటగాడు. కూరల్లో కరివేపాకుల్ని కూడా అయన ఎలా వాడాలో తెలుసు..! ఉన్నట్టుండి అచ్చెన్నాయుడికి అధ్యక్ష పగ్గాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది..? అనేది ఆలోచించాల్సిన విషయమే కదా..!! ఒకవేళ.., అచ్చెన్నాయుడు కూడా అందరు ఎమ్మెల్యేల్లాగా సైలెంట్ గా ఉంటే ఆయనకు అధ్యక్ష పదవి దక్కేదా..? అచ్చెన్న జైలుకి వెళ్లకపోతే.., ఆయనకు అధ్యక్ష పదవి వచ్చేదా..? అచ్చెన్నాయుడుపై ఒకవేళ సానుభూతి రాకుంటే., బీసీగా పార్టీకి ఉపయోగపడకుంటే ఆ పదవి ఇచ్చేవారా..? ఇన్ని ఉన్నాయి కాబట్టే అచ్చెన్నాయుడికి ఆ కిరీటం దక్కింది. దాని చుట్టూ ముళ్ళున్నాయి.

* ఇన్ని మాటలు ఎందుకు..? టీడీపీని నిందిస్తున్నాము అనుకుంటారేమో..!! ఒక్క పాయింటు చాలు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రబ్బర్ స్టాంప్ లా ఉంటూ, పెద్దగా ప్రభావం చూపని కళా వెంకట్రావుకి పగ్గాలు ఇచ్చారు. అప్పుడు పార్టీకి బలమైన నాయకత్వం అవసరం లేదు. అధికారం ఉంది కాబట్టి.., గట్టి నాయకుడు అధ్యక్షుడుగా ఉంటే లోకేశుడు అనే నాయకుడి ఆటలు సాగవు. కానీ ఇప్పుడు లోకేశు ఆట, మాట, బాట ఏదీ సాగట్లేదు. జగన్ సాగనీయట్లేదు. అందుకే ఇక షాడో అధ్యక్షుడు కాకుండా డైరెక్ట్ గా పని చేసే దూకుడైన నాయకుడు కావాల్సి వచ్చింది. అందుకే అచ్చెన్నకు ఈ ముళ్ళ కిరీటం దక్కింది. ఈయన కూడా జైలుకి వెళ్లి వచ్చే వరకు.. ఆ పదవి ఇవ్వాలనే ఆలోచన కూడా బాబుకి లేదు. కానీ సానుభూతి, బీసీ కార్డు, దూకుడు అన్నీ కలిసి వచ్చి బాబుగారి కన్నింగ్ కి పని పడింది. సో.., అలా అచ్చెన్నాయుడు అధ్యక్షుడు అయ్యారోచ్చ్..!!

పదవుల్లో పదనిసలు..!!

అంతే కాదు. పదవుల్లో కొన్ని పదనిసలు దాక్కున్నాయి. పొలిట్ బ్యూరో నుండి ఇటీవల రాజీనామా చేసిన గల్లా అరుణ కుమారిని.. జాతీయ ఉపాధ్యక్షురాలిని చేశారు. ఆమె తనయుడుఎం, గుంటూరు ఎంపీ జయదేవ్ ని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. పార్టీలో ఉంటారో వెళ్తారో తెలియని పితాని సత్యన్నారాయనని కూడా పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. పొలిటికల్ సెక్రెటరీగా తేదీ జనార్దన్ ని ఉంచారు. పెద్దగా ఇతర మార్పులు లేనప్పటికీ తెలంగాణ అధ్యక్షుడిగా మాత్రం రమణని కొనసాగించారు. దీనిలోనూ మర్మం ఉంది. అక్కడ పార్టీ అధ్యక్షుడిగా ఎవ్వరూ ముందుకు రాక.., మరో దిక్కు లేక.., రమణని ఉంచారు. ఇక రాష్ట్ర కమిటీలో చోటు ఉంటుంది అనుకున్న అనగాని సత్య ప్రసాద్, చింతమనేని ప్రభాకర్, డోలా బాల వీరాంజనేయ స్వామిలకు చోటు దక్కలేదు.

 

Related posts

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?