NewsOrbit
రాజ‌కీయాలు

గీతం × జగన్ ఎపిసోడ్ లోపలి కథ ఏంటో తెలుసా..??

cm jagan vs gitam university

రాజు గారి చిన్న భార్య అందగత్తె.. అని అంటే పెద్ద భార్య అందంగా లేనట్టే కదా.. అని ఓ సామెత ఉంది. అలా ఉంది ప్రస్తుతం టీడీపీ పరిస్థితి. మాస్ పద్ధతిలో చెప్పాలంటే మింగాలేక.. కక్కాలేక అన్నమాట. తప్పుని తప్పని చెప్పలేక, అందులో తాము చేసింది కూడా ఉంది గనక, అసలు మాట్లాడకపోతే మరీ తప్పవుతుంది కనక.. మొత్తంగా తన వాళ్లను కాపాడుకోవడానికి పడుతున్న తాపత్రయం.. ప్రయత్నాలనే తెలిసిపోతున్నాయి. విశాఖలోని గీతం యూనివర్శిటీ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుందంటూ అధికారులు ఆ భూముల స్వాధీనానికి తెర తీసిన విషయం తెలసిందే. జేసీబీతో కూల్చివేతలు జరిగాయి. దీంతో అలర్టయిన టీడీపీ చంద్రబాబు, లోకేశ్ తోపాటు నేతలందరూ స్పందించేస్తున్నారు. అయితే..

cm jagan vs gitam university
cm jagan vs gitam university

టీడీపీ.. అలా అనలేక..! ఇలా..

వైసీపీ కూల్చివేతలకు పాల్పడుతోంది.., నోటీసులు ఇవ్వకుండానే విధ్వంసాలకు పాల్పడుతున్నారు, ఇది అరాచక పాలన అంటూ హడావిడి చేస్తున్నారు. కానీ.. ‘అవి అక్రమ కట్టడాలు కాదు, ఆక్రమణ జరగలేదు, అంతా పక్కాగా కొనుక్కున్న స్థలమే’ అని ఏ ఒక్క టీడీపీ నాయకుడు కూడా అనటం లేదు. లేదూ.. గీతం సంస్థ కూడా చెప్పడం లేదు. ‘ఇలా కూల్చేయడం దారుణం’ అనే మాట తప్పించి మరో మాట లేదు. అధికారంలో లేనప్పుడు టీడీపీకి గీతం ఓ ఆర్ధిక వనరు అనే మాట ఉంది. పైగా.. హీరో బాలకృష్ణ అల్లుడు.., బంధుత్వం, మిగిలిన ఫ్యాక్టర్స్ కూడా తోడయ్యాయి. దీంతో గీతంకు టీడీపీ మద్దతు మాత్రమే ఇస్తోంది. అవి ఆక్రమణలు కాదు.. సక్రమాలే అని చెప్పలేకపోతోంది ఇందుకే. మొన్నటికి మొన్న సబ్బం హరికి ఇంటి దగ్గర కూడా ఆక్రమణలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు గీతం.

అప్పట్లోనే ఎందుకు క్రమబద్దీకరించలేదు..

వైసీపీ నేతలు కూడా ఇదే అంటున్నారు. నిజంగా గీతం సంస్థ ఆక్రమణలకు పాల్పడకపోతే ప్రభుత్వం ఎందుకు కూల్చి వేస్తుంది? ఆక్రమణలే లేకపోతే గత టీడీపీ హయాంలోనే ఎందుకు క్రమబద్దీకరణ చేయలేదు? అని ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏ టీడీపీ నాయకుడి దగ్గరా సమాధానం లేదు.. ఉండదు. గీతం ఆక్రమించింది అని చెప్తున్న 40 ఎకరాలే కాదు.. చాలా ఆక్రమణలు ఉన్నాయని అంటున్నారు. అధికారం అండతో భూములను ఆక్రమించుకున్నారని తెలుస్తోంది. ఇందులో నిజం ఉంది కాబట్టే టీడీపీ నేతలు అడ్డగోలుగా స్పందిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు.

Related posts

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju