NewsOrbit
Featured టాప్ స్టోరీస్ న్యూస్

సీఎం పేషీ నుండి నిమ్మగడ్డకి లేఖ..! వేడి పుట్టిస్తున్న తాజా అంశం ఇదే..!

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందనేది ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే. ఈ తరుణంలో ప్రభుత్వంలోని ఒ పెద్ద ఐఎఎస్ అధికారికి, ఎన్నికల కమిషన్ లోని ఓ ముఖ్య అధికారి (రిటైర్డ్ ఐఎఎస్) మధ్య ఏర్పడిన తాజా వివాదం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో ఈ నెల 28న సమావేశం నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. అయితే త్వరలో జరగనున్న పార్లమెంట్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల 26వ తేదీ సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హజరుకావాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ పంపండం వివాదాస్పదం అయ్యింది. దీనిపై నిమ్మగడ్డ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటుగా సమాధానం పంపినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం నిర్వహించే ఏ సమావేశాలకు తన అనుమతి లేకుండా వెళ్లవద్దని ఎన్నికల సంఘం కార్యదర్శిని ఆయన ఆదేశించారుట.

హైకోర్టు న్యాయమూర్తితో సమాన హోదా గల పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ కు జూనియర్ అధికారి సమావేశానికి హజరుకావాలని ఆదేశాలు జారీ చేయడం అభ్యంతరకరం అని ఇది బెదిరింపు ధోరణిలా ఉందంటూ నిమ్మగడ్డ..ప్రవీణ్ ప్రకాష్ కు ఘాటుగా లేఖ రాసినట్లు సమాాచారం. అయితే ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్ కు పంపాల్సిన లేఖ పొరపాటున ఎన్నికల కమిషనర్ కు వెళ్లిందని ప్రవీణ్ ప్రకాష్ కార్యాలయ వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణుగుతుందో లేదో చూడాలి మరి.

author avatar
Special Bureau

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju