అందం, అభినయం కలబోసినట్లు ఉండే శ్రీదేవి లీడ్ రోల్ లో నటించిన నాగిన, నిగాహెన్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగా అలరించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాంఛైజీలో డైరెక్టర్ విశాల్ ఫురియా, నిర్మాత నిఖిల్ ద్వివేది ‘నాగిన్ ‘చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ అందలబామ శ్రద్దాకపూర్ లీడ్ రోల్ నటించనున్నారు. ఈ విషయాన్ని శ్రద్దాకపూర్ తన ట్విటర్ ద్వారా తెలిపింది.
నాగిన్ పాత్రలో స్క్రీన్ పై కనిపించడం చాలా గర్వంగా భావిస్తున్నాను. శ్రీదేవి మేడమ్ ‘నాగిన’, ‘నిగాహెన్’ సినిమాలను చూస్తూ పెరిగాను. ఇలాంటి పాత్రల్లో నటించాలన్నది నాకు ఎప్పటినుంచో ఉన్న కోరిక ‘ అంటూ అందలబామ తన ట్విటర్ పోస్ట్ చేస్తూ తన సంతోషాన్ని నెటిజన్లతో పంచుకుంది. 2020 సంవత్సరం మొదట్లో స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ, బాఘీ చిత్రాలతో ఈ బామ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని చేరుకోలేకపోయాయి. అయితే నాగిన ఏ అయినా హిట్ కొడుతుందేమో చూడాలి.
శ్రద్ధకపూర్ మాత్రం నాగినతో పక్కాగా హిట్ కొడతానని చెబుతోంది. ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్స్ కూడా శ్రీదేవిని తలపించేలా నటించగలదనే నమ్మకంతో ఉన్నారని సమాచారం. శ్రద్ధకపూర్ యాక్టింగ్ లోను కాకుండా డ్యాన్స్ లో కూడా ఇరగదీస్తుందని చెబుతున్నారు. ఈ ప్లెస్ పాయింట్లతో సినిమా బంపర్ హిట్ కొట్టడం పక్కా అనే నమ్మకంతో ఉన్నారు.