NewsOrbit
న్యూస్

స్థానిక ఎన్నికల కోసం టీడీపీ ఎదురుచూపులు!ఇవీ చంద్రబాబు లెక్కలు!!

స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది.మొన్నటి అసెంబ్లీ ,లోకసభ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్న టిడిపి ఈ ఏడాదిన్నర కాలంలో పుంజుకున్న దాఖలాలు లేనప్పటికీ వైసిపి ప్రభుత్వంపై కనిపించనంత అసంతృప్తి ప్రజల్లో ఉందని ఆ పార్టీ అంచనా వేస్తోంది.

మార్చి నెలలో జరగాల్సిన స్థానిక సంస్థలు వాయిదా పడ్డానికి దారితీసిన కారణాలు ఆ తర్వాత సంభవించిన పరిణామాలు అందరికీ తెలిసినవే.అయితే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై హైకోర్టులో విచారణ జరుగుతోంది.వైసిపి ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని చెబుతుండగాస్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు జరపడానికి పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయంటున్నారు.ఈ కేసు విచారణ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సైతం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వచ్చిన ఇబ్బందేమిటని హైకోర్టు వ్యాఖ్యానించడాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా రాష్ర్టంలో మోగే సూచనలు గోచరిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో త్వరగా ఎన్నికలు జరిగితే బాగుంటుందని టిడిపి ఉత్సాహపడుతోందని సమాచారం.రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాల పైన పెట్టిన దృష్టిని అభివృద్ధిని మీద పెట్టడం లేదన్నది నిర్వివాదాంశం. సంక్షేమ పథకాలతో ప్రజలను సంతృప్తి పరిస్తే చాలు ఓట్ల వర్షం కురస్తుందనది ముఖ్యమంత్రి జగన్ లెక్క కావచ్చు.అందుకే ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ నెలకో సంక్షేమ పథకం ద్వారా ప్రజల బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేసేస్తున్నారు.అదే సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి అటకెక్కింది. ఈ కారణంగా రాష్ట్రంలో పల్లెలు మొదలు పట్టణాల వరకు సమస్యలు పేరుకుపోయాయి.అంతేగాక కరోనా కారణంగా మధ్యతరగతివర్గాలు బాగా దెబ్బతిన్నాయి.వారికి ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయమూ అందడం లేదు.

మరోవైపు ఉద్యోగుల జీతాలను కరోనా పేరుతో కట్ చేయడం,బకాయి ఉన్న కరువు భత్యాలను ఇవ్వకపోవడం ,పీఆర్సీ నివేదికను పెండింగ్లో ఉంచటం వంటి కారణాల వల్ల ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో కూడా తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది.రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల కొత్త పరిశ్రమలేవీ ఏపీకి రాకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోయి నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహలకు గురవుతున్నాయి.ఒక్కమాటలో చెప్పాలంటే జగన్ ప్రభుత్వం పేదలను తప్ప ఇతర వర్గాలను వీటిని పట్టించుకోవడం లేదన్నది ప్రధాన విమర్శ.వారికి సమస్యలు ఉంటాయన్నదాన్ని జగన్ ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదంటున్నారు.ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు గనుక జరిగితే తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి ఎంతోకొంత ఎడ్జి ఉంటుందన్నది చంద్రబాబునాయుడు లెక్కగా కనిపిస్తోంది.అందుకే స్థానిక సంస్థల కోసం టిడిపి ఆశగా ఎదురుచూస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

Related posts

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju