కరోనా వైరస్ చేసిన నష్టం ఎన్నటికీ పూర్చలేనిది. ఎంతో మంది వారి ఆత్మీయులను కోల్పోయారు. ఎంతో మంది రోడ్డున్న పడ్డారు. ఈ విషాధ గాథలను పక్కన పెడితే.. కరోనాతో పోరాడి జయించిన వారు సైతం.. కొందరు ఇంకా పూర్తిగా కోలుకోలేదట. వారిలో పలు సమస్యలు వస్తున్నాయని, అవి వారిని తీవ్రంగా బాధిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.
కరోనా బారిన పడిన వారిపై పరిశోధకులు ఒక రీసెర్చ్ చేశారు. అందులో తేలిన విషయం ఏంటంటే కరోనా సోకిన వారిలో కొత్త సమస్యలు వస్తున్నాయని ఈ రీసెర్చ్ తేల్చిచెప్పింది. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారిలో కొందరు పూర్తిగా దాని నుంచి బయటపడలేదని.. వారిలో చర్మ సంబంధ వ్యాధుల వస్తున్నట్లు ఈ రీసెర్చ్ పేర్కొంది.యూరోపియన్ అకాడమీకి చెందిన చర్మ నిపుణులు ఈ రీసెర్చ్ చేశారు. యూఎస్‌లోని మస్సాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ లో జరిగిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు.
ఈ రీసెర్చ్ కోసం సైంటిస్టులు 1000 కేసులను ఎంచుకున్నారు. దాదాపు 12 రోజుల పాటు కరోనా లక్షణాలు ఉండి చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిని ఎంపిక చేసుకున్నారు. వారిని కూడా 39 దేశాలకు చెందిన 224 మందిని ఈ రీసెర్చ్ కు తీసుకున్నారు. 90 ల్యాబ్‌ల ద్వారా నిర్ధరించిన కేసులను పరిశోధకులు పరీక్షించారు. వీరిలో చర్మంపై పొలుసులు, పొక్కులు ఉన్నావారు కూడా ఉన్నారు. అలాగే ఇతర సమస్యలు ఉన్నవారిని కూడా ఈ రీసెర్చ్ లో పరీక్షించారు. దీన్ని ఇప్పటికే కొవిడ్ టోస్గా వ్యవహరిస్తున్నారు. దీని వల్ల కాళ్లు, చేతులు ఎరుపెక్కడం, వాపు రావడం లాంటి లక్షణాలు ఉంటాయి. వీరిని కూడా 15 రోజుల పాటు పరిశీలించారు పరిశోధకులు.
ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ డెర్మటాలజీ సొసైటీస్, అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ సహాకారంతో ఈ రీసెర్చ్ జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వివరాలను సేకరించారు. జూన్, ఆగస్టు నెలల్లో సైంటిస్టులు సేకరించిన విషయాలతో డాక్టర్ల వద్దకు వెళ్లారు.కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోని వారు చర్మ వ్యాధులతో కనీసం 60 రోజులు పాటు బాధపడుతున్నట్లు ఈ పరిశోధకుల బృందం పేర్కొంది.
ఈ రీసెర్చ్ తో ఇంతకుముందు తెలియని సమస్యలను ఇప్పుడు కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఎక్కువ రోజులపాటు ఉండే చర్మవ్యాధులను, అలాగే కొవిడ్ టోస్ వల్ల బాధపడే వారిలో వచ్చే సమస్యలను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.ఈ రీసెర్చ్ వల్ల ఎన్నో విషయాలు తెలిసినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. వాటివల్ల ఆ సమస్యలను ముందగా అంచనా వేసి రాకుండా ఉండేందుకు కావలసిన చికిత్స అందించే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు.