NewsOrbit
రాజ‌కీయాలు

బాబు పునాదులు వేశారు.. జగన్ బిల్డింగ్ కడుతున్నారు..!!

cm jagan following chandrababu vision in debts

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు పునాదులు వేశారు. దానిపై జగన్ బిల్డింగ్ కడుతున్నారు. ఇదేదో అభివృద్దికో అనుకునేరు.. అప్పులకు..! రాష్ట్రాన్ని అప్పులకొండగా మార్చడంలో చంద్రబాబు ఒకస్థాయికి తీసుకెళ్తే.. జగన్ మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. పోటాపోటీగా సంక్షేమ పథకాలు.. జేబులో డబ్బులు పెట్టే పథకాలు ప్రవేశపెట్టడంతో ఏపీకి అప్పులు తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రం అప్పులు చేసే స్థాయి కూడా దాటిపోయిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ అప్పుల జాతరపై జగన్ ప్రభుత్వం ముందు ముందు ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

cm jagan following chandrababu vision in debts
cm jagan following chandrababu vision in debts

ఆశించింది ఎక్కువ.. వచ్చింది తక్కువ

ప్రస్తుతం రాష్ట్రం అప్పులపైనే నడుస్తోందనేది నిర్వివాదాంశం. మొదటి ఆరు నెలల్లో రెవెన్యూ కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సవం తొలి అర్ధభాగంలో రెవెన్యూ రూ.44 వేల 915 కోట్లు ఉంటే… అప్పులు రూ. 55 వేల 169 కోట్లు ఉన్నాయి. ఏడాదిలో రూ.1,61,958.50 కోట్ల ఆదాయం సమీకరించే విధంగా బడ్జెట్‌లో అంచనాలు వేశారు. కానీ.. మొదటి ఆరు నెలల్లో కేవలం 27.73శాతం మాత్రమే సాధించారు. కేంద్రం సాయం కూడా నాలుగో వంతు మాత్రమే వచ్చింది. రాష్ట్రం చేసిన ఖర్చులో సగం కన్నా ఎక్కువ మొత్తం అప్పు రూపంలోనే ఉంది. ఈ లెక్కలను పరిశీలిస్తే రాష్ట్ర ఆదాయం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఏపీకి కేంద్ర సాయం కూడా అంతంతమాత్రంగానే దక్కడంతో ఏపీ వేసుకున్న లెక్కలకు, రాబడికి ఖర్చుకు సంబంధం లేకుండా పోయింది.

ఇలాగే ముందుకెళ్తే ఎలా..

ఈ పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ముందు ముందు మరిన్ని సవాళ్లు ఎదురుకాబోతున్నాయని చెప్పాలి. అప్పులు తెచ్చుకునే వెసులుబాటు పెంచుకుందంటేనే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టారు. బహుశా.. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మొత్తంలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం లేదని చెప్పాలి. మరి జగన్ ఇదే తరహాలో వెళ్తే ఖజానాపై మరింత భారం పడుతుందని అంటున్నారు. సీఎంగా జగన్ ఎలా ఆలోచిస్తారో.. ముందుకెళ్తారో చూడాలి.

 

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju