NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ మంత్రిని వ‌దిలిపెట్టొద్దు… టీడీపీ కొత్త ఫోక‌స్‌

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేయ‌డంలో ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏ మాత్రం అవ‌కాశం దొరికినా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌హా ఆయ‌న టీంను టార్గెట్ చేస్తున్నారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ దూకుడు చూస్తుంటే వైసీపీ స‌ర్కారులోని ఓ మంత్రిని టార్గెట్ చేసింద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.
ఆయ‌నే ఏపీ ర‌వాణ శాఖ మంత్రి పేర్ని నాని. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్య‌లు, ఉప‌యోగించిన ప‌దాలు ఇందుకు నిద‌ర్శ‌నంగా పేర్కొన్నారు.

జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య గ‌త కొద్దికాలంగా నిలిచిపోయిన ఆర్టీసీ ర‌వాణా సేవ‌లు తిరిగి ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.“అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగి, తనను, కేసీఆర్‌ని చూసి నేర్చుకోవాలని ఉపన్యాసాలిచ్చి, ప్రగతి భవన్‌కు వెళ్లి మరీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి శాలువాలు కప్పివచ్చిన జగన్ హానీమూన్ పీరియడ్ ముగిసిట్టుంది.“ అని ఎద్దేవా చేశారు. “పక్క రాష్ట్రంతో ముడిపడిన ప్రతి అంశంలో కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేని అసమర్థ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి మిగిలారు. అనేక అంశాల్లో స్వరాష్ట్రానికే తీరని అన్యాయం చేసిన జగన్, తెలంగాణకు తిరిగే ఆర్టీసీ బస్సుల విషయంలోకూడా ఏమీ చేయలేకపోవడం దారుణం“ అని ప‌ట్టాభిరామ్ ఆరోపించారు.

బ‌స్సులు తిప్ప‌లేని నాని….

దసరా సమయంలో పొరుగు రాష్ట్రానికి బస్సులు కూడా తిప్పలేకపోయారు. ఇప్పుడేమో తెలంగాణతో ఆర్టీసీ బస్సులు తిప్పే అంశంలో చేసుకున్న ఒప్పందం చూస్తే, ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అయింద‌ని అనిపిస్తోందని ప‌ట్టాభిరామ్ ఆరోపించారు. “ రవాణామంత్రి పేర్నినాని తీరికలేకుండా గడుపుతూ, తెలంగాణలో జరిగిన చర్చలకు వెళ్లలేక పోయాడు. రవాణాశాఖ గురించి, ఆర్టీసీ సర్వీసుల గురించి మాట్లాడరు. మీడియా ముందుకొచ్చి, ప్రభుత్వం విధించే అడ్డగోలు జరిమానాలను సమర్థించడం మాత్రం ఆయనకు బాగా తెలుసు.“ అంటూ విరుచుకుప‌డ్డారు.

పేర్ని నానిపై నిప్పులు…

“రెండు నెలల నుంచీ తెలంగాణతో చర్చిస్తున్నామని చెప్పిన పేర్ని నాని, 371 సర్వీసులకు కోత పెట్టారు. అసలే రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుంటే, దాదాపు లక్ష కిలోమీటర్ల వరకు తగ్గించేశారు. మన రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సులు గతంలో 2,65,363 కిలోమీటర్లవరకు తెలంగాణలో తిరిగేవి. ఇప్పుడేమో లక్షా 5 వేల కిలోమీటర్ల వరకు మైలేజీ తగ్గించేశారు. మంత్రి హోదాలో హైదరాబాద్ వెళ్లి, తెలంగాణ మంత్రితో చర్చించలేని వ్యక్తి పేర్ని నాని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు“ అంటూ విరుచుకుప‌డ్డారు.

Related posts

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk