కొంచెం తియ్యతియ్యగా. కొంచెం పుల్లపుల్లగా తింటున్న కొద్దీ తినాలనిపించే పైనాపిల్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. హెల్తీయెస్ట్ ఫ్రూట్ గా పైనాపిల్ కు పేరుంది. ఇందులో జీరో ఫ్యాట్, జీరో కొలెస్ట్రాల్, పుష్కలంగా విటమిన్ ఏ, బి, సీ, పొటాషియమ్, మాంగనీస్, కాపర్ ఉంటాయి. ప్రొటీన్స్, మినరల్స్, పోషకాలు మెండుగా ఉంటాయి.
మీరు ఎప్పుడైనా కడుపు నిండా లాగించేస్తే అది సులభంగా జీర్ణం కావాలంటే ఒక చిన్న అనాస ముక్కను తింటే త్వరగా జీర్ణమైపోతుంది. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ఒక్క అనాస ముక్కను తింటే తీసుకున్న ఆహారం మొత్తం సులభంగా జీర్ణమవుతుంది. అనాసపండులో మన జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం అనే గుణం ఉంటుంది. ఇది మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
సంతాన సమస్యలతో బాధపడేవారు అనాసపండును తినడం చాలా మంచిది. అనాస పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనాస పండు మూత్ర పిండాల్లోని రాళ్లను కూడా కరిగించగలదని ఆయుర్వేద నిపుణులు చాలా కచ్చితంగా చెబుతున్నారు.
అనాస పండు ముక్కలను తేనెతో కలిపి రోజు తీసుకుంటే శరీరానికి శక్తితో పాటు మేని ఛాయ మరియు నిగారింపు కూడా వస్తుంది. రోజూ పైనాపిల్ జ్యూస్ తాగినా, తిన్నా చాలా ఎనర్జిటిక్ గా మరియు ఆక్టివ్ గాఉంటారు.ఒకవేళ ఒత్తిడి మరియు డిప్రెషన్‌తో మీరు బాధపడుతున్నట్లయితే రోజూ తప్పకుండా ఒక గ్లాసు పైన్ ఆపిల్ జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. పైన్ఆపిల్ జ్యూస్ పచ్చకామెర్లకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.