NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

వైసీపీ – టీడీపీ వైకుంఠపాళి..! విశాఖలో భూ మంత్రకాళి..!!

భూ అక్రమాలపై సిట్ వేశారు. కానీ విచారించకుండా కూర్చోబెట్టారు. ప్రభుత్వ భూములను అనుయాయులకు కట్టబెట్టారు. బయటకు రాకుండా సర్దుకున్నారు ; టీడీపీ ప్రభుత్వంలో జరిగింది ఇదీ..!

రాజధాని చేస్తామన్నారు. భూముల ధరలు పెంచారు. పేదలకు అందకుండా చేశారు. ప్రభుత్వ భూములపై కన్నేశారు, అక్కడక్కడా కన్నమేసారు ; వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్నది ఇదీ..!

ఒక్కటి మాత్రం నిజం. విశాఖకు రాజధాని వస్తుందో రాదో.., విశాఖ రాజధానిగా మారుతుందో.., లేదో కానీ..  భూములు మాత్రం పరాయిపరమవుతున్నాయి. నాడు టీడీపీ వాళ్లకి, నేడు వైసీపీ వాళ్లకి వరమవుతున్నాయి. విశాఖలో జరుగుతున్నది ఏమిటి..? నాడు, నేడు ఏంటి తేడా అనే అంశాలను ఓ సారి పరిశీలిస్తే..!!

ప్రభుత్వ భూములకు కొదవ లేదు..!!

విశాఖపట్నంలో ప్రభుత్వ భూములకు ఏమాత్రం కొదవ లేదు. విశాఖ చుట్టుపక్కల దాదాపు 40 వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములున్నాయి. కొండగట్టు, అటవీ, దేవాదాయ భూములున్నాయి. ఇవి ఎక్కువగా భీమునిపట్నం, పరవాడ, కాపులుప్పాడు, ఆనందపురం, అనకాపల్లి, విశాఖ గ్రామీణ పరిధిలోకి వస్తాయి. గడిచిన రెండు దశాబ్దాల నుండి భూముల ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో వీటిపై రాజకీయుల కళ్ళు పడ్డాయి. టీడీపీ హయాంలో కొన్ని అక్రమాలు ఎలా జరిగాయంటే..!?

టీడీపీ నేతల భూమాయలెన్నో..!!

ప్రభుత్వ భూములను కొట్టేయడం అంత ఈజీ కాదు. అలా అని అంత కష్టమూ కాదు. కాస్త తెలివి ప్రయోగిస్తే, భూముల లోతులు తెలిస్తే ఈ అక్రమాలు చేసేయొచ్చు. అందుకే టీడీపీ హయాంలో కొందరి నేతల అనుచరులు ఇదే చేసారు. కేవలం భీమునిపట్నం, ఆనందపురం, పరవాడ మండలాల్లోనే సుమారుగా 3 వేల ఎకరాలు కన్నమేసారు.


* ముందుగా ఎక్కడ ప్రభుత్వ భూమి ఉందొ గుర్తిస్తారు. ప్రభుత్వ భూములు మాజీ సైనికులకు, వికలాంగులకు, అల్ప వర్గాలకు పట్టాలు ఇస్తుంటారు. అందుకే ఇలా కొందరిని గుర్తించి భూముల కోసం దరకాస్తు చేయించేవారు. సదరు దరకాస్తు ఆధారంగా అధికారులు భూమిని కట్టబెట్టేవారు. ఆ తర్వాత ఈ భూమిని రాజకీయులు కొనుక్కుని, రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు. తద్వారా ప్రభుత్వ భూమి అధికారికంగా అక్రమానికి గురైనట్టే.
* ఇలా విశాఖ చుట్టుపక్కల మండలాల్లో 2000 నుండి 2015 మధ్య సుమారుగా 5 వేల ఎకరాలు జరగగా.., 2015 తర్వాతే మరో 2 వేల ఎకరాలు అన్యాక్రాంతమైంది. మొదట ఒకరి చేతుల్లో పట్టాగా మారిన తర్వాత దాన్ని అమ్ముకోవడం, కమర్షియల్ గా మార్చేయడం సులువైన పని. టీడీపీ హయాంలో ఇదే జరిగింది. రాజకీయులు, అధికారులు కలిస్తే ఇది మరింత సులువవుతుంది. విశాఖలో అదే జరిగింది. మాజీ సైనికులకు, ఎస్సీలకు ఇచ్చిన భూమిని వారు అమ్ముకోకూడదు. కానీ అమ్మకానికి కూడా అధికారులు నిరభ్యంతర పత్రాలు ఇవ్వడమే ఇక్కడ అధికారుల పాత్ర. ఇలా గడిచిన ఆరేళ్లలో లక్షకి పైగా నిరభ్యంతర పత్రాలు ఇచ్చారు.

ఇప్పుడు వైసీపీ వచ్చాక ఏం జరుగుతుంది..!?

టీడీపీ హయాంలో అవినీతి జరిగింది. మరి వీటిని క్యాష్ చేసుకోవాలి కదా..? అందుకే ఆ నేతలే.. వైసీపీలో కొందరు కలిసి ఇప్పుడు వాటిని రియల్ ఎస్టేట్ గా మార్చేశారు. ఇక్కడ టీడీపీ / వైసీపీ అనేది పక్కన పెడితే.. భూ అక్రమాల విషయంలో అందరూ ఒక్కటయ్యారు. పార్టీలకు సంబంధం లేదు. వారి నాయకులకు మాత్రమే పార్టీలు, రంగులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకునే వారికి భూములను అమ్మేస్తూ వాటాలేసుకుంటున్నారు. గత ఏడాది అక్టోబర్ నుండి ఏ ఏడాది మర్చి వరకు విశాఖలో రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగింది. సాధారణ ధరల కంటే అయిదు రేట్లు ఎక్కువ పలికింది. ఆగస్టు నాటికి లాక్ డౌన్ ఎత్తేసాక కొన్నాళ్ళు బాగానే ఉన్నా.. రాజధాని విషయంలో గందరగోళం ఉండడంతో కాస్త తగ్గాయి. ముఖ్యంగా విశాఖ శివారున భీమునిపట్నం, పరవాడ, ఆనందపురం ప్రాంతాల్లో భూములు ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉన్నాయి. అక్కడితో వైసీపీ పాత్ర అయిపోలేదు అండోయ్.., నాడు జరిగినట్టే కొత్తగా భూముల గుర్తింపు.., వాటిని మళ్ళీ పట్టాలుగా ఇప్పించుకోవడం.., వాటిని తమ అనుయాయుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కూడా షరా మామూలుగానే జరిగిపోతున్నాయి.

 

 

 

 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?