NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీలోకి జానారెడ్డి??….డీల్ ఏంటో తెలుసా?

తెలంగాణ కాంగ్రెస్‌కు ఇంకో షాక్ త‌గ‌ల‌నుందా? ఇప్ప‌టికే గ్రేట‌ర్‌లో ఘోర ప‌రాజ‌యం ఎదురై ఒక్కో వికెట్‌ను రాల్చుకుంటున్న ఆ పార్టీకి ఇంకో దిమ్మ‌తిరిగే షాక్ త‌గ‌ల‌నుందా? అంటే అవున‌నే ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోంది.

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి బీజేపీలో చేరనున్నట్లు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చి క‌మ‌లం పార్టీలో చేర‌నున్న‌ట్లు పేర్కొంటున్నారు. ఇదంతా నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల   రాజకీయం.

జానారెడ్డికి బీజేపీ గాలం

ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య మ‌ర‌ణంలో నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ను కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బీజేపీ ఇప్ప‌టికే గేమ్ మొద‌లుపెట్టిన‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం కేరళలో ఉన్న జానారెడ్డితో బీజేపీ ఇప్పటికే టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీ ఇచ్చిన ఆఫర్‌కు జానారెడ్డి కూడా సరే అన్నట్లు సమాచారం.  ఢిల్లీ వెళ్లి, బీజేపీ అగ్రనేతల సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. అంతేకాకుండా నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బరిలోకి కూడా దిగనున్నట్లు జోస్యం చెప్పింది.

గ‌త కొంత‌కాలంగా ..

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన బీజేపీ…. ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల నాటికి తమ పునాదులను పటిష్ఠం చేసుకోవాలని నిర్ణయించుకొని కొత్త గేమ్ మొద‌లుపెట్టిన‌ట్లు స‌మాచారం. అందులో భాగంగానే వివిధ పార్టీల్లోని సీనియర్లు, ద్వితీయ శ్రేణి నేతలను తమవైపు మళ్లించుకొని, అధికార పీఠానికి చేరువయ్యేలా ఢిల్లీ వ్యూహకర్తలు ప్లాన్ సిద్ధం చేశారు. అందులో భాగంగానే జానారెడ్డిని బీజేపీ కదిపిందని నేతలు పేర్కొంటున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య హఠాన్మరణంతో నాగార్జున సాగర్‌‌ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావ‌డంతో ఈ నియోజకవర్గంపై బీజేపీ జెండాను ఎగువరేసి, అటు టీఆర్‌ఎస్‌కు, ఇటు కాంగ్రెస్‌కు ఝలక్ ఇవ్వాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయించుకున్నారు. ఈ క్ర‌మంలోనే జానారెడ్డిపై దృష్టి పెట్టార‌ని స‌మాచారం.

జానారెడ్డి ద‌మ్మేంటో తెలుసా?

నాగార్జునసాగర్ పై రాజకీయంగా జానారెడ్డికి ఎనలేని పట్టుంది. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అయిన జానారెడ్డి గత కొంత కాలంగా రాజకీయంగా, పార్టీ కార్యకలాపాల పరంగా స్తబ్దుగా ఉంటున్నారు. అయితే, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ద్వారా తిరిగి క్రియాశీలం కావాలని డిసైడ్ అయినట్లు స‌మాచారం. మరోవైపు నాగార్జున సాగర్‌లో పాగా వేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఈ ఎన్నికల్లోనే జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని బరిలోకి దింపాలని బీజేపీ మొదట నిర్ణయించుకుందని వార్తలొచ్చాయి. జానారెడ్డి కూడా అందుకు సిద్ధమైపోయారు. అయితే బీజేపీ నేతల చర్చలతో జానారెడ్డి మనసు మార్చుకున్నట్లు సమాచారం. కుమారుడు రఘువీర్ కాకుండా తానే స్వయంగా రంగంలోకి దిగాలని జానారెడ్డి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. జానారెడ్డి ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారా? కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చి బీజేపీలో చేరనున్నారా? సోష‌ల్ మీడియా ప్ర‌చారం నిజ‌మేనా? అంటే దానికి జానారెడ్డి లేదా ఆయ‌న త‌ర‌ఫున వెలువ‌డే ప్ర‌క‌టనే క్లారిటీ ఇస్తుంది.

Related posts

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju