తెలుగు టెలివిజన్ ప్రేక్షకులలో ఎంతగానో ఆదరణ దక్కించుకుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ప్రస్తుతం సీజన్ ఫోర్ కొనసాగుతోంది. దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇంకా రెండు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఇదిలా ఉంటే తెలుగులో మొట్టమొదటి బిగ్ బాస్ సీజన్ వన్ లో అడుగుపెట్టిన యాంకర్ హరితేజ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా లో నెటిజన్లతో పంచుకుంది.
ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసి స్వయంగా ఆమె వెల్లడించింది. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వడం ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపింది. హరితేజ చేసిన కామెంట్లకు చాలా మంది ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. యాంకర్‌గా సినిమా ఇండస్ట్రీలో రాణించిన హరితేజ అంతకుముందు సీరియల్ లో కూడా యాక్ట్ చేయడం జరిగింది.
ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిందో అప్పుడు మరింత పాపులారిటీ సంపాదించుకుంది. సీజన్ వన్ లో దాదాపు టైటిల్ గెలిచిన అంత విధంగా హరి తేజ పోటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సీజన్ వన్ లో హరితేజ చెప్పిన బుర్రకథ ఇప్పటికి కూడా హైలెట్ అని చెప్పవచ్చు. దీంతో బిగ్ బాస్ హౌస్ ఇచ్చిన పాపులారిటీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడం జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు” సినిమా లో హరితేజ కామెడీ తరహాలో పాత్ర చేయడం జరిగింది. ఏది ఏమైనా హరితేజ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో తెలపడంతో ఆమె అభిమానులు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.