NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ 23rd బుధవారం రాశి ఫలాలు

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

డిసెంబర్ – 23 – మార్గశిర మాసం – బుధవారం.శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, బుధవారం, తిథి: నవమి రాత్రి 8.39 వరకు తదుపరి దశమి, నక్షత్రం: రేవతి రాత్రి తెల్లవారు జాము 4.33 వరకు తదుపరి అశ్విని, వర్జ్యం: పగలు 3.05 నుండి 4.53 వరకు, అమృత ఘడియలు: రాత్రి 1.51 నుండి 3.39 వరకు, రాహుకాలం: పగలు 12.15 నుండి 1.38 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 11.53 నుండి పగలు 12.37 వరకు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి : పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. వాదోపవాదాలు వచ్చిన పట్టించుకోకండి. ఈరోజు రుణబాధలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మొండి బకాయిలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాహనాల ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. ఈరోజు తలపెట్టిన పనులు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈరోజు కోపాలను అదుపులో పెట్టుకోండి. ఈరోజు మానసిక వేదనకు గురి అయ్యే అవకాశం ఉంది. ప్రతి చిన్న సమస్యకు బాధపడకుండా దానికి సమస్యలు ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఈరోజు మీ మీద నరఘోష నరఘోష పడే అవకాశం ఉంది. ఈరోజు అందరితో సఖ్యత గా ఉండటం మంచిది. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వస్తువులను క్రయవిక్రయాలు చేయకుండా ఉండటం మంచిది, వాటి వల్ల నష్టం కలిగే అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకున్నంత లాభాలు ఉండకపోవచ్చు. ఈరోజు పట్టుదలతో పనులను చేస్తే అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు కొంత మందికి రుణాలు ఇవ్వకపోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఈరోజు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. పై అధికారులతో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు అనవసరపు గొడవలకు, తగాదాలకు వెళ్లకుండా ఏది పట్టించుకోకుండా చదువుకోండి.

రెమిడీ: ఈరోజు రామ రక్షా స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి : ఈరోజు అనుకున్నది సాధిస్తారు !

ఈరోజు పనులు అయిపోయే అవకాశం ఉంది. ఈరోజు క్రయవిక్రయాలు చేస్తారు. సంపాదన పెరుగుతుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఈరోజు భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు మీతో విడిపోయిన బంధువులు మళ్లీ కలిసే అవకాశం ఉంది. ఈరోజు అప్రయత్న కార్యసిద్ధి కలిగే అవకాశం ఉంది. ఈరోజు అంతా ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఈరోజు ధన ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు సంగీతం మీద శ్రద్ధ చూపుతారు. ఈరోజు విద్యార్థులు చదువుకోవాలని బాగా  తపన పడతారు. ఈరోజు సాంప్రదాయం మీద పద్ధతుల మీద శ్రద్ధ చూపుతారు. పెద్దవారిని గౌరవిస్తారు, సూచనలను పాటిస్తారు. మంచి భక్తి భావన భావన పెంచుకుంటారు. స్నేహితులతో కలిసి పని చేస్తారు. ఈరోజు ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధిస్తారు. ఈరోజు వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. ది వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు. ఈరోజు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఈరోజు ప్రకృతిని ఆస్వాదించాలని అనుకుంటారు. క్రొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ముందడుగు వేస్తారు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.

రెమిడీ: ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి : ఉద్యోగస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు బంధువులతో, స్నేహితులతో, ఇంట్లో సభ్యులతో వాదోపవాదాలకు వివాదాలకు పోకండి . ఈరోజు మీరు చేసే పనికి గుర్తింపు లభించక ఆందోళన పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈరోజు సమయానికి నిద్ర ఆహారాలు మానకండి. ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈరోజు నిరాడంబరంగా ఉండటం మంచిది. ఈరోజు చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. మీరు నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉంది. అనవసరపు పరిచయాలను పెంచుకోకుండా ఉండడం మంచిది. ఈరోజు ముఖ్యమైన విషయాలను ఇతరులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది. పెద్దవారి సూచనలను పాటించడం మంచిది. ఈరోజు ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పై అధికారుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.

రెమిడీ:ఈరోజు లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి.

 

కర్కాటక రాశి : శుభ కార్యాల్లో పాల్గొంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఈరోజు బంధువుల నుంచి సహాయం పొందడం వల్ల సంతోషంగా ఉంటారు. ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు సంగీతం పట్ల సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. ఈరోజు ప్రత్యేకత విద్యలను నేర్చుకోవాలని ఆలోచిస్తారు. ఈరోజు ఏ పని చేయాలనుకున్నా వెంటనే చేసేస్తారు, సకాలంలో పని పూర్తి చేస్తారు. ఈరోజు మెడిటేషన్ యోగాసనాలు చేయడం వల్ల దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈరోజు అనాథ ఆశ్రమాలకు అన్నదాన సత్రం లకు విరాళాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు నిజాయితీగా ధర్మంగా ఉండాలనుకుంటారు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. అధికారులు చెప్పిన పనులను సమయానికి పూర్తి చేసి వారి మన్ననలను పొందుతారు. విద్యార్థులు మీ తండ్రి యొక్క కష్టాన్ని చూసి సహాయం చేయాలనుకుంటారు. విద్య మీద దృష్టి విద్య మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఈరోజు స్త్రీలు సంతోషంగా సంతోషంగా ఉంటారు. బాధ్యతలు పెరుగుతాయి. ఈరోజు అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు.

రెమిడీ:ఈరోజు దగ్గర్లో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి గణపతిని దర్శించుకోండి.

 

సింహరాశి : ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు అకారణంగా ఎవరిమీద కోపం తెచ్చుకోకుండా ఉండడం మంచిది. ఈరోజు నీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఈరోజు బంధువులతో అభిప్రాయభేదాలు పెంచుకోకుండా సఖ్యత ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈరోజు మీ కన్నా చిన్న వారితో గొడవ పడకుండా ఉండండి. ఈరోజు ఆవేశంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు చిన్న చిన్న అబద్ధాల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈరోజు పెద్దవారిని గౌరవించడం మంచిది ఈరోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.

రెమిడీ: ఈరోజు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి : ఈరోజు శత్రువులను తగ్గించుకుంటారు !

ఈరోజు కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు, దీర్ఘకాలిక రోగాలను తగ్గించుకునే అవకాశం ఉండి. ఈరోజు సంపద పెరుగుతుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భార్యాభర్తల సఖ్యతగా ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉండటం వల్ల కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఈరోజు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు శత్రువులను తగ్గించుకుంటారు, అందర్నీ సన్నిహితులుగా చేరుకుంటారు. ఈరోజు మీ మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఈరోజు తప్పనిపరిస్థితుల్లో మీకు నచ్చిన వారితో పరిచయం పెంచుకుంటారు. ఈరోజు అనుకున్న పనిని సమర్థవంతంగా ధైర్యంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు కష్టపడితే ఉన్నతస్థాయికి వెళ్లగలుగుతారు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలం. ఈరోజు గృహాలను గాని స్థలాలను కాని వస్తువులను కాని కొనుగోలు చేస్తారు. భార్యాభర్తలు పరస్పర సహాయం చేసుకుంటే సభ్యతగా ఉంటారు. విద్యార్థులు ఏ విషయమైనా బాగా ఆలోచించి విద్య మీద శ్రద్ధ వహించి ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ రోజు స్త్రీలు మానసిక ప్రశాంతంగా ఉంటారు.

రెమిడీ:ఈరోజు లలితా అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

తులారాశి : సంతాన విషయంలో జాగ్రత్త !

ఈరోజు అనవసరంగా కొత్త పరిచయాలు పెంచుకోకుండా ఉండడం మంచిది. ఈరోజు అనవసరపు ఆలోచనలు ఎక్కువగా  ఆలోచిస్తారు. ఈరోజు స్నేహితుల తో గొడవ పడకుండా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈరోజు మీ గృహంలో అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఈరోజు ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. బంధువులతో సఖ్యత గా ఉండండి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఎవరితో వాదోపవాదాలు, తగాదాలు పెట్టుకోకుండా ఉండండి. తక్కువగా మాట్లాడడం మంచిది. ఈరోజు విలువైన ఖరీదైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు శారీరక శ్రమ ఎక్కువ అవ్వడం వల్ల ఆందోళన పడే అవకాశం ఉంది. ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దంపతులిద్దరూ సఖ్యతగా ఉండండి. ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు చెడు వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకండి. ఆధ్యాత్మిక చింతన చేయడం మంచిది. ఈరోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి. ఈరోజు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.

రెమిడీ: ఈరోజు సుబ్రహ్మణ్యాష్టక పారాయణాన్ని చేసుకోండి.

 

వృశ్చిక రాశి : ఈరోజు మానసిక ధైర్యం కలిగి ఉంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఈరోజు పెద్దల ఆశీర్వచనం పొందుతారు. ఈరోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించి పోటీ పరీక్షలలో  ఉత్తీర్ణత పొందటానికి విజయాన్ని సాధిస్తారు. ఈరోజు క్రయవిక్రయాలకు లాభం కలుగుతుంది. ఈరోజు మానసిక ధైర్యం కలిగి ఉంటారు. సంతోషంగా ఉంటారు. ఈరోజు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు పెద్ద వారిని వారి సూచనలను గౌరవిస్తారు. ఈరోజు పుట్టింటి నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు చఆరోగ్యంగా ఉంటారు. స్నేహితులను పెంచుకుంటారు.

రెమిడీ:ఈరోజు లక్ష్మీ అష్టకం పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి : ఈరోజు భవిష్యత్తు గురించి ఆందోళన పడతారు !

ఈరోజు నిరుత్సాహంగా ఉంటారు. బద్ధకంగా ఉంటారు. పనులను అనుకున్న సమయంలో పూర్తి చేసుకోండి. ఈ రోజు ఏ సమయానికి నిద్ర ఆహారాలు మానకండి మానకండి. ఈరోజు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈరోజు మనోవేదన పడతారు. ఈరోజు కష్టసుఖాలను ఒకేసారి ఎదుర్కొంటారు. ఈరోజు దంపతులిద్దరూ సఖ్యత గా ఉండండి.ఈరోజు తక్కువగా మాట్లాడండి. ఈరోజు ఎవరితో వాదోపవాదాలు, తగాదాలు పెట్టుకోకుండా ఉండటం మంచిది.ఈరోజు కోపాలకు దూరంగా ఉండండి.ఈరోజు అందరితో చక్కగా ఉండండి. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి.ఈరోజు భవిష్యత్తు గురించి ఆందోళన పడతారు.ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పై అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.ఈరోజు మిత్రులే శత్రువులుగా అయ్యే అవకాశం ఉంది. ఈరోజు సున్నిత మనస్తత్వం గా ఉంటారు.ఈరోజు విద్యార్థుల విద్య మీద శ్రద్ధ వహించండి, స్నేహితులకు దూరంగా ఉండండి.స్త్రీలు ఈరోజు ఇంట్లో వారితో బంధువులతో ఆలోచించి మాట్లాడండి. ఈరోజు పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజుశ్రీ వేంకటేశ్వర వజ్రకవచ పారాయణాన్ని పారాయణాన్ని చేసుకోండి.

 

మకర రాశి : వివాహ ప్రయత్నాలకు అనుకూలం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.ఈరోజు వివాహ ప్రయత్నాలకు అనుకూలం.ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు మీ మాట తీరును బట్టి జనాకర్షణ పొందుతారు. ఈరోజు ఉన్నంతలో సంతోషంగా ఉంటారు. ఈరోజు ధనాభివృద్ధి కలుగుతుంది.ఈరోజు రుణ బాధలు తగ్గుతాయి.ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి.ఈరోజు దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.ఈరోజు సనాతన సాంప్రదాయానికి, భక్తికి శ్రద్ధ చూపుతారు.దేవాలయ దర్శనం చేసుకుంటారు. ఈరోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకుంటారు.ఈరోజు విద్యార్థులు విద్య మీదనే శ్రద్ధ వహించి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు.ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది.

రెమిడీ: ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ చేసుకోండి శుభప్రదంగా ఉంటుంది.

 

కుంభరాశి : ఈరోజు ఆశా దృక్పథంతో ముందుకు సాగుతారు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.ఈరోజు  అనుకున్న సమయానికి పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు దైవదర్శనం చేయాలని తపన పడతారు. ఈరోజు ఆశా దృక్పథంతో ముందుకు సాగుతారు.ఈరోజు ఇష్టమైన వ్యక్తులను దూరం చేసుకొనే అవకాశం ఉంది.ఈరోజు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల అప్పులు చేస్తారు.ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ.ఈరోజంతా అసహనం గా ఉండడం మంచిది కాదు.ఈరోజు కొంత మంది మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఈరోజు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.ఈరోజు భవిష్యత్తు గురించి దీర్ఘాలోచన చేస్తారు. ఈరోజు చివరి దాకా వచ్చిన అవకాశాలను చేజార్చచ్కుంటారు.ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.ఈరోజు విద్యార్థులు విద్య మీదనే దృష్టిని కేంద్రీకరించండి.అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి.స్త్రీలు ఈరోజు కొంచెం మానసిక ఆందోళన కలిగి ఉంటారు.ఈరోజు అన్ని రకాల వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకండి.

రెమిడీ: ఈరోజు దుర్గాస్తోత్ర పారాయణ చేసుకోండి.

 

మీన రాశి : ఈరోజు ప్రతిభకు తగ్గ గుర్తింపు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు.వాణిజ్య ప్రకటనలను చూసి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.ఈరోజు శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఈరోజు ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి. ఈరోజు వివాహ ప్రయత్నాలు జరుగుతాయి.ఈరోజు వాహనాలను కొనుగోలు చేయడానికి అనుకూలమైన రోజు.ఈరోజు ఏమైనా వస్తువులను క్రయవిక్రయాలు చేస్తారు.ఈరోజు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఈరోజు స్నేహితుల నుంచి అయినా బంధువుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. ఈరోజు పితృ పూర్వక ఆస్తులు సంక్రమిస్తాయి. మాతృ పూర్వక ఆస్తులు సంక్రమిస్తాయి. ఈరోజు అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు పిల్లల కోసం డబ్బు ఖర్చు పెడతారు.ఈరోజు మీ మాటలకు సంఘంలో విలువ పెరుగుతుంది. ఈరోజు అందరితో సంతోషంగా ఉంటారు.ఈరోజు వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి.ఈరోజు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కలుగుతుంది.ఈరోజు స్వల్ప ధనలాభం కలుగుతుంది.ఈరోజు మొండి బకాయిలు వసూలవుతాయి.ఈరోజు సభలు సమావేశాలో పాల్గొంటారు. ఈరోజు ఏ పనినైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు.ఈరోజు భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కుటుంబంలో ఇబ్బందులు తగ్గి సంతోషంగా ఉంటారు. పెద్ద వారి సూచనలను పాటిస్తారు.

రెమిడీ: ఈరోజు లలిత  చాలీసా పారాయణం చేసుకోండి.

 

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N