NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆదిత్యనాథ్ దాస్… ఓ కరుడుగట్టిన అధికారి ; జగన్ ది మంచి ఛాయిస్

రాష్ట్రానికి కొత్త సిఎస్ గా రాబోతున్న ఆదిత్యనాథ్ నియామకం మీద కొన్ని అభ్యన్తరాలు ఉన్నా ఉన్నవారిలో పరిపాలన విషయంలో క్లీన్ అండ్ నీట్ విభాగంలో మాత్రం ఆదిత్యనాథ్ దాస్ ముందు ఉంటారు. వివాదరహితుడిగా పేరున్న ఆయన తన కెరీర్లో ఎన్నో ఆటుపోట్లు, ఇంకెన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఎటు పరిపాలన పరంగాను తన పరిమితులు దాటరు… అతి చేయరు అన్న పేరుంది. రూల్స్ ఫాలో కావడంలో లేదా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో ఆయన స్టైల్ వేరుగా ఉంటుంది అనేది సివిల్ అధికారులు చెప్పే మాట. రాష్ట్రంలో ఉన్నా సీనియర్ అధికారులను కాదు అని.. కొందరు కేంద్ర విభాగం లో ఉన్నా వారిని మళ్ళి రాష్ట్రానికి తీసుకురాకుండా పాలకుల్లో బెస్ట్ గ ఉండేవారిలో ఆదిత్యనాథ్ బెస్ట్ ఛాయిస్ అని కొందరు చెబుతుంటే, సీనియర్స్ ను కావాలనే పక్కన పెట్టి కొత్త సంప్రదాయానికి తెర తీసారని కొందరు మాట్లాడుతున్నారు.

** బీహార్ కు చెందిన ఆదిత్యనాథ్ దాస్ వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. పీజీ అనంతరం సివిల్స్ రాసి విజయం సాధించారు. 1987 బ్యాచ్ లో ఆంధ్రకు కేటాయించారు. ఉమ్మడి ఆంధ్రలో కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టరుగా, వరంగల్ జిల్లా కలెక్టర్ గా పనిచేసారు. వైస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా సమయంలో నీటిపారుదల శాఖా కార్యదర్శిగా పనిచేసిన ఆయన వైస్ కు బాగా దగ్గరయ్యారు. జలయజ్ఞం కార్యక్రమానికి వైస్ అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రతి కార్యక్రమంలో దాస్ వైస్ పక్కనే ఉంటూ ప్రాజెక్ట్ ల స్థితిగతులు చెప్పేవారు. అలా ఆయనకు వైస్ తో మంచి అనుబంధం ఉంది. ఇక జగన్ సైతం నీలం సాహ్ని తర్వాత ఆమె భర్త అజయ్ సాహ్నితో సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం వంటి సీనియర్లతో పాటు, కేంద్ర సర్వీసుల్లో దాస్ కంటే ముందు ఉన్నా అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, నీరబ్ కుమార్ ప్రసాద్ వంటి వారిని కాదని దాస్ వైపు మొగ్గు చూపడానికి ఇవే కారకులుగా తెలుస్తోంది.


** దాస్ కెరీర్లో ఓ సారి మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో ఉగ్రవాదుల కిడ్నప్ కు గురయ్యారు. అక్కడ కడుతున్న పెద్ద ఆస్పత్రి నిర్మాణ బాధ్యతల్లో ఉన్నా ఆయన స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించిన అక్కడి తీవ్రవాద సంస్థ ఆయనను ఎత్తుకెళ్లిన సంఘటన సంచలనం సృష్టించింది. అయితే దాస్ అక్కడి పరిస్థితి ఉద్యోగాల కల్పనా మీద ఎలాంటి నిబంధనలు ఉన్నాయో వారికీ అర్ధం అయ్యేలా చెప్పడంతో తిరిగి వారే ఆయనను ఇంటి వద్ద దింపారు.
** దాస్ వరంగల్ కలెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు తెలంగాణ అంతటా నక్సల్స్ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉండేది. ఒక సమయంలో నక్సల్స్ దాస్ ను హిట్ లిస్ట్ లో పెట్టుకుని పాలకులకు కొమ్ము కాస్తున్నాడు అనే ఆరోపణతో మట్టు బెట్టేందుకు ప్రయత్నించారు. ఆయన కార్ మీద దాదాపు 100 రౌండ్స్ కాల్పులు జరిపారు. అయితే ఈ దాడిలో దాస్ గాయాలతో బయటపడ్డారు. అయితే ఆయన డ్రైవర్ మాత్రం మృతి చెందారు.
** ఆదిత్యనాథ్ దాస్ పనిలో నిక్కచ్చిగా ఉంటారు అనేది పేరు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలను అమలు చేసేలా చూడటం ప్రత్యేక పని. అలహీ అధికారుల మీద అజమాయిషీ ఉంటుంది. ఈ రెండు విషయాల్లో పక్కాగా ఉంటె సిఎస్ బాధ్యతలు పెద్ద కష్టం ఏమి కావు. అయితే వైస్ దగ్గర పనిచేసిన అనుభవం ఉన్నా దాస్ కు ఇప్పుడుజగన్ దగ్గర పని చేయడం కొత్త అనుభవమే, దీన్ని ఆయన ఎంత సమర్ధంగా నెట్టుకు వస్తారు అనేది చూడాలి.. అన్నట్టు దాస్ వయస్సు 59 . మరో సంవత్సరం ఆయనకు పదవి ఉంటుంది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju