NewsOrbit
న్యూస్

ఆ మహిళా చోరశిఖామణి అలాగ దొరికిపోయింది! ఎలాగంటారా ?చదవండి !

భారీ దొంగతనం చేసి పరారీలో ఉన్న మహిళ ఒక చిన్న బలహీనతను దాచుకోలేక పోలీసులకు దొరికిపోయిన సంఘటన ఇది!ఆమెను పట్టుకోలేక అగచాట్లు పడుతున్న పోలీసులకు సదరు మహిళ దొంగే తనకు తెలియకుండానే తన అడ్రస్ ,ఫోన్ నెంబర్ తెలియజేసింది.దీంతో పోలీసుల పని సులువైంది!

ఆమె చేసిన పొరపాటేమిటంటే…ఇక చదవండి !

అపార్ట్మెంట్ లో దొంగతనం చేసిన మహిళ… రెండు నెలల తర్వాత దొంగతనం చేసిన చీరను కట్టుకుని వాట్సప్ స్టేటస్ పెట్టటంతో పోలీసులకు దొరికిపోయింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని డోలాస్ నగర్ లో ప్రైమ్ గెలాక్సీ అపార్ట్ మెంట్ లో కత్తి ఆమోద్ అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. 2020, నవంబర్ 29న అతని అపార్ట్ మెంట్ లో చోరీ జరిగింది. నాలుగు బంగారుగాజులు, మంగళ సూత్రం, నెక్లెస్, రెండు చెవిదిద్దులు, బేబీచైన్‌ ఒకటి, మరికొన్ని వస్తువులు చోరీకి గురయ్యాయి.బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదే చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

కానీ పోలీసు విచారణలో ఫలితం లేకపోయింది. దొంగను కనిపెట్టలేకపోయారు. అయితే చోరీ అయిన విలువైన వస్తువులతో పాటు కొన్ని చీరలు కూడా ఉన్నాయి. అదే అపార్ట్ మెంట్ లో గతంలో పనిచేసిన సునీత అనే మహిళ చోరీ అయిన బంగారు ఆభరణాలు, చీర కట్టుకుని డిసెంబర్ 24న  వాట్సప్ స్టేటస్ పెట్టింది. ఆ స్టేటస్ చూసిన ఆమోద్ భార్య వెంటనే భర్తకు చూపించింది. ఆమోద్ సునీత ఫోన్ నెంబర్ తో సహా, ఆధారాలతో స్క్రీన్ షాట్ ను పోలీసులకు అందచేశాడు.

పోలీసులు నిందితురాలిని మంగళగిరి కొత్త బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.సునీత గతంలో అపార్ట్ మెంట్ లో కొంతకాలం పని మనిషిగా పని చేసేది. ఆసమయంలో ఖాళీగా ఉన్న అపార్ట్ మెంట్లు శుభ్రం చేయమని మేనేజర్ తాళాలు ఇవ్వగా వాటితోపాటు అమోద్ ప్లాటు డూప్లికేట్ తాళాలు కూడా తీసుకువెళ్ళి చోరీకి పాల్పడింది. అమోద్ ఫ్లాట్ లో కప్ బోర్డు పగలగొట్టి అందులో బంగారం దోచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిందని సీఐ సుబ్రహ్మణ్యం వివరించారు.

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju