NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అటు ఇటు ఐతే తిరుపతి మళ్ళీ దుబ్బాకే!! ఈ అంశాలు కీలకం

 

 

(న్యూస్ ఆర్బీట్ ప్రత్యేకం )

రాజకీయాల్లో తిమ్మిని బమ్మి చేయొచ్చు… ఉన్నది లేనట్లు చూపించొచ్చు… అలాగే ఎన్నికల్లో ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి… మన దేశంలో ఓటర్ల నాడీ పట్టుకోవడం అంత సులభమైన విషయం కాదు… ఇప్పుడు సాంకేతిక యుగంలో అస్సలు సాధ్యం కాని పని అది…. ఇప్పుడు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల హీట్ రాష్ట్రంలో మొదలైంది… కరోనాతో మృతిచెందిన తిరుపతి వైఎస్ఆర్సిపి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ స్థానానికి జరిగే ఈ ఉప ఎన్నిక అధికారపక్షానికి నల్లేరు మీద నడక అని ఇప్పటి వరకు అంతా భావించారు… గత ఎన్నికల్లో వచ్చిన మేజర్టీ కంటే సానుభూతి పవనాలు గట్టిగా వీచి ఈసారి అధికారపక్షానికి చెందిన ఎంపీ మెజారిటీ మరింత పెరుగుతుందని ఇప్పటికే అధికార పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.. అయితే అధికారపక్షం దీన్ని ప్రాతిపదికగా, లెక్కలు వేసుకుంటే మాత్రం నాయకులు పార్టీ కార్యకర్తలు ఉంటే పెను నష్టం తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఏమిటా స్థితి అన్నది చూస్తే…””న్యూస్ ఆర్బీట్ “” ప్రత్యేక పరిశీలన…

 

** తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సత్యవేడు, గూడూరు, సూళ్లూరుపేట మూడు ఎస్సి నియోజకవర్గాల్లో అయితే, తిరుపతి, శ్రీకాళహస్తి వెంకటగిరి, సర్వేపల్లి అన్ రిజర్వ్డ్ కేటగిరి లో ఉన్నాయి. మొత్తం ఏడు స్థానాల్లోనూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గెలిచారు.

** 2019 లో వైఎస్సార్సీపీ తరఫున నిలబడిన దుర్గాప్రసాద్ కు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీ లో అత్యధిక భాగం అంటే సుమారు 1/3 వంతు మెజారిటీ ఎస్సీ నియోజకవర్గాల నుంచి బల్లి దుర్గాప్రసాద్ పడింది. సూళ్లూరుపేట లో అసెంబ్లీ మెజారిటీ 70, 336 అయితే, సత్యవేడు లో 44 వేల 744 ఓట్ల మెజారిటీ వచ్చింది. అలాగే గూడూరులో 40,459 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఎస్సీ నియోజకవర్గాల్లో ఎక్కడా క్రాస్ ఓటింగ్ జరిగిన దాఖలాలు కనిపించలేదు.

** అన్ రిజర్వుడు నియోజకవర్గం అయిన తిరుపతి లో భూమన కరుణాకర్ రెడ్డి కి కేవలం 708 ఓట్ల మెజార్టీ వచ్చింది. అలాగే శ్రీకాళహస్తిలోని 38,141 ఓట్ల మెజారిటీ, సర్వేపల్లి లో 13వేల 973, వెంకటగిరిలో 38, 720 ఓట్ల మెజారిటీ ఆయా ఎమ్మెల్యేలకు వచ్చింది. ఈ నియోజకవర్గాల్లో నే ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగింది.

** 2019 తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థికి పడిన ఓట్ల వివరాలను పరిశీలిస్తే తిరుపతి లో అత్యధికంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ముఖ్యంగా ఇక్కడి ప్రజలు ఒకటి వైఎస్ఆర్సీపీ కు మరొక టీ టిడిపి కు అన్న నినాదాన్ని విధానాన్ని పాటించినట్లు అర్థమవుతోంది.ఏమిటీ వైస్సార్సీపీ కు ఉన్న గండాలు??

** ప్రధానంగా తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఇప్పుడు బీజేపీ జనసేన పక్షమే అధికార పార్టీకి ప్రధాన పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని పరంగా చూస్తే వైఎస్ఆర్సిపి కు ఉన్న లోపాలు, క్షేత్ర స్థాయి పరిస్థితి ఎలా ఉంది ఒకసారి గమనిద్దాం..

** తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో కాపుల ఓట్లు ఎక్కువ. వీరిది సుమారు 38 శాతం వరకు ఓటింగ్ ఉండే అవకాశం ఉంది. అంటే అభ్యర్థి నిర్ణయాత్మక శక్తి వీరి తీసుకుంటారు. గత ఎన్నికల్లో కాపులు ఒక ఓటు వైఎస్ఆర్సిపి కు మరో ఓటు టిడిపి లేదా బిఎస్పీ కి వేశారు. ఇప్పుడు బీజేపీ జనసేన ఏకమై పవన్ కళ్యాణ్ ఎక్కడ పర్యటించి ఓట్లు అడిగితే కాపులు ఓట్లు గట్టిగా పడే అవకాశం ఉంది. అందులోనూ కాపులంతా జనసేన పార్టీ తమ పార్టీగా ఓన్ చేసుకుంటన్న సమయంలో… గతంలో బొటాబొటి మెజారిటీతో గెలిచిన భూమన కరుణాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుపతిలో బిజెపి ముందంజ వేసే అవకాశం ఉంది.

** శ్రీకాళహస్తి నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ కాపులు ఓట్లు, కమ్మ ఓట్లు, రెడ్డి స్వీట్లు అధికంగా ఉంటాయి. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న బియ్యపు మధుసూదన్ రెడ్డి కీలకమైన నాయకులు కలుపు వెళ్లడంలో అశ్రద్ధ వహిస్తే ఉన్నారనే భావన నాయకుల్లో ఉంది. ముఖ్యంగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఎస్ సి వి నాయుడుకి ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరక పోవడంతో ఆయన పార్టీ మీద అలక తో ఉన్నారు. అంటి ముట్టనట్లు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయుడు కొన్ని మండలాల్లో గ్రామాల్లో మంచి పట్టున్న నాయకుడు. ఆయనను ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సైతం వైఎస్ఆర్సిపి కు గట్టి దెబ్బ పడుతుంది. అలాగే శ్రీకాళహస్తిలో బిజెపి నాయకుడు కోలా ఆనంద సైతం కొన్ని గ్రామాలను ప్రభావితం చేయగల నాయకుడు. దీంతో ఈ నియోజకవర్గంలో అటూ ఇటూ అయినా వైయస్సార్సీపికు కష్టమే.

** సత్యవేడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి కు మంచి మెజారిటీ వచ్చింది. మొత్తం ఏడు మండలాల్లో ని నాయకులు ఒకే తాటిమీద ఉన్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే ఆదిమూలం మీద మాత్రం ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తోంది. కొన్ని మండలాల నాయకులను ఆదిమూలం పట్టించుకోవడం లేదని అధికార పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఇది ఎన్నికలనాటికి బీజేపీ క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ టిడిపి కు బలమైన నాయకులు లేకపోవడం, ఆ పార్టీ మీద ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత సైతం వైఎస్ఆర్సిపి ఉపయోగపడినా బిజెపి చివరి నిమిషంలో ఎస్సీ నియోజకవర్గం అయిన సత్యవేడులో కొందరు నేతలు బరిలోకి దింపి నాయకులను ఆకర్షించే అవకాశాలు లేకపోలేదు. అంటే వైయస్ఆర్సీపీ లోనే ఉంటూ బిజెపికి అంతర్గతంగా ఎమ్మెల్యే మీద ఉన్న కోపం తో పనిచేసే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి.

** గూడూరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు గతంలో తిరుపతి ఎంపీగా పనిచేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అయిన వరప్రసాదరావు తీరు భిన్నంగా ఉంటుంది. ఏమాత్రం ఇష్టం లేకుండా తిరుపతి ఎంపీ స్థానాన్ని వదులుకొని గూడూరు స్థానానికి వచ్చిన వరప్రసాదరావు ఎన్నికల వేళ కూడా కొన్ని చేష్టలు వార్తల్లోకి ఎక్కాయి. ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా డీమోట్ అయినట్లు భావించే వరప్రసాద రావు గూడూరు వైఎస్ఆర్సిపి కార్యకర్తలను నాయకులను కలుపుకుని వెళ్లడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఒకసారి వరప్రసాద రావు ఇంటి మీదకు సైతం వైఎస్సార్సీపీ కార్యకర్తలు వెళ్ళి ఆయనను నిలదీయడం పెద్ద వివాదం అయింది. గత లోక్సభ ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి కు మంచి మెజారిటీ వచ్చింది. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే వరప్రసాదరావు తీరుతో ఎంతో కడుపు మండి ఉన్న వైఎస్సార్ సీపీ నేతలు ఈసారి ఎన్నికల్లో ఆయన బుద్ధి చెప్పేందుకు కచ్చితంగా యాంటీ గా పనిచేసేందుకు సిద్ధం అవుతున్నారు. దీనిని బిజెపి నాయకులు నిశితంగా గమనిస్తున్నారు. వర ప్రసాద రావుకు వ్యతిరేకంగా కనుక వైఎస్ఆర్ సీపీ నేతలను ఉమ్మడిగా పని చేస్తే ఇక్కడ వైఎస్ఆర్సిపి కి పెద్ద దెబ్బ పడుతుంది.

** వెంకటగిరి నియోజకవర్గం ఇప్పుడు కీలకంగా మారింది. నెల్లూరు జిల్లాలో ఎంతో పేరున్న ఆనం కుటుంబసభ్యులను జగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడంతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ తోనూ ఆయనకు పడటం లేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పార్టీతోనూ అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్న ఆనం ఈసారి కచ్చితంగా వైఎస్ఆర్సిపి కు ఇక్కడ దెబ్బ వేసేందుకు ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. వెంకటగిరి నియోజకవర్గం పరిధిలోని వైఎస్ఆర్ సీపీ నాయకులతో ఆయన సమావేశమై.. దీనికి ఇప్పటికే చర్చలు సాగించినట్లు తెలిసింది. మరోపక్క వెంకటగిరిలో టిడిపి కు ఆయన సహాయం చేసే అవకాశాలు లేకపోలేదని దీనిద్వారా జగన్కు ఓ సంకేతం ఆనం వర్గం పంపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

** ఎటొచ్చీ ఎక్కువ మెజారిటీ సాధించిన సూళ్లూరుపేట నియోజకవర్గం, నెల్లూరు జిల్లా వైయస్సార్ సిపి బాధ్యతలు చూస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ఎలాంటి ఇతర ఇబ్బందులు లేకుండా కనిపిస్తోంది.. మిగిలిన నియోజకవర్గాల్లో కచ్చితంగా జగన్ దృష్టి పెట్టి అక్కడ ఉన్న సమస్యలను తీర్చకపోతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో వాటిని వాడుకొనేందుకు సిద్ధంగా ఉంది…. అధికార పార్టీ చాలా సులభంగా గెలుస్తుందని అనుకుంటున్న కతిరుపతి ఉప ఎన్నికలు తారుమారు అయ్యేలా… దుబ్బాక ఫలితాలు కనిపించే అవకాశం లేకపోలేదు అన్నది జగన్ గుర్తు పెట్టుకోవాల్సిన

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju