NewsOrbit
జాతీయం ట్రెండింగ్

సిగరెట్లు తాగుతున్నారా? ఇకపై అలా దొరకవు.. కేంద్రం కొత్త బిల్!

సాధారణంగా పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎన్నో వాణిజ్య ప్రకటనల ద్వారా అధికారులు తెలియజేస్తున్నప్పటికీ రోజురోజుకీ పొగతాగే వారి సంఖ్య పెరుగుతోంది. వయసు తారతమ్యం లేకుండా పొగాకు ఉత్పత్తులకు బానిసగా అయిపోయారు.ధూమపానానికి బానిస గా మారడం వల్ల ఎంతోమంది ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధ పడుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ పొగాకు ఉత్పత్తులను వినియోగాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుంది. ఇందులో భాగంగానే పార్లమెంట్ వేదికగా ఓ కొత్త బిల్లును త్వరలోనే తీసుకురానుంది. దీనికోసం కేంద్రం ఇప్పటికే పలు అంశాలతో ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేసింది.

పొగాకు ఉత్పత్తులలో ఒకటైన సిగరెట్లను ఇప్పటివరకు విడివిడిగా అమ్మేవారు. ప్రస్తుతం విడిగా అమ్మే సిగరెట్ల విక్రయంపై నిషేధాన్ని విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం పొగ తాగడానికి ప్రస్తుతం ఉన్న కనీస వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 21 సంవత్సరాల లోపు ఉన్న వారు పొగాకు ఉత్పత్తులను విక్రయించి, నిబంధనలను ఉల్లంఘించినట్లు నిరూపితమైతే లక్ష రూపాయల జరిమానాతో పాటు, ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు.

ఇప్పటి వరకు రెస్టారెంట్లు, విమానాశ్రయాలలో పొగతాగడం కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి ఉన్న ప్రభుత్వాలు ప్రస్తుతం వాటిని కూడా మూసి వేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా విద్యాసంస్థల చుట్టు పరిసర ప్రాంతాలలో దాదాపు వంద మీటర్ల దూరం వరకు పొగాకు ఉత్పత్తులు అమ్మ కూడదనే అభిప్రాయాన్ని కూడా ఈ బిల్లులో పొందుపరిచినట్లు తెలియజేశారు. అయితే తొందరలోనే ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే నిబంధనలకు విరుద్ధంగా పొగతాగే వారిపై చర్యలు తప్పవని కేంద్రం తెలియజేసింది.

Related posts

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతకు జైల్ అధికారులు షాక్ .. ములాఖత్‌కు అనుమతి నిరాకరణ..! ఎందుకంటే..?

sharma somaraju

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju