NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బాబుకి ఊహించని షాక్ ఇచ్చిన 37 సంవత్సరాలుగా పార్టీలో ఉన్న నేత ..!!

40 సంవత్సరాల రాజకీయ అనుభవం అంటూ ఊహించని విధంగా తాజాగా చంద్రబాబు తీసుకున్న హిందుత్వ స్టాండ్ కి సొంత పార్టీలోనే ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. గతంలో కుల రాజకీయాలు చేస్తూ ఉన్న తరుణంలో ప్రజలు వాటిని పట్టించుకోకుండా 2019 ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పటం జరిగిందని, దీంతో ఇప్పుడు రాజకీయంగా పబ్బం గడపడానికి చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారని ప్రత్యర్థులు చెప్పుకొస్తున్నారు.

Chandrababu Naidu asked to move out of house in govt notice, residence to be demolishedఇలాంటి తరుణంలో తాజాగా సొంత పార్టీలోనే 37 సంవత్సరాలుగా ఉన్న మాజీ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే తాజా పరిణామాలను బట్టి పార్టీకి రాజీనామా చేయటంతో చంద్రబాబుకి ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది. 2014 నుండి 2019 వరకు ఉన్న ఫిలిప్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లెటర్ రాయడం జరిగింది. ఆయన రాసినా లెటర్ ఈ విధంగా ఉంది…1983 నుండి అనగా టిడిపి పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీలో కొనసాగడం జరిగింది.

 

37 సంవత్సరాలుగా టీడీపీ జెండా మోస్తూనే ఉన్నాను. ఆంగ్లో ఇండియన్ క్రిస్టియన్ నామినేటెడ్ ఎమ్మెల్యేగా 2014 – 2019 ఐదేళ్లపాటు పార్టీ నన్ను నామినేట్ చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్న క్రిస్టియన్ అసోసియేషన్ లో ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అందుకే ఒక బాధ్యతగల పౌరుడిగా మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. అనేక మతాలు కులాలు ఉన్నప్పటికీ అందరూ కలిసి ఉంటారు. ఎవరి విశ్వాసాలు వారివి. ఎవరి నమ్మకాలు వారివి. ప్రస్తుతం చంద్రబాబు టిడిపి పార్టీ వైఖరి చూస్తుంటే బాధేస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు మెడలో సిలువ వేసుకుని..బైబిల్ చదువుతూ నా జన్మ ధన్యమైపోయింది అని వ్యాఖ్యానించిన వ్యక్తి.. మొన్న రాజకీయంగా ఆయన ప్రయోజనం ఆశించి రామతీర్థం సంఘటన పైన సంబంధం లేకపోయినా బైబిల్..యేసుక్రీస్తు గురించి క్రైస్తవ్యం గురించి మాట్లాడటం చూస్తే, ఇంత కాలం ఇటువంటి వ్యక్తి నాయకత్వంలో పని చేశామా అని చెప్పుకోవటానికే సిగ్గు పడుతున్నాం.

 

ఎక్కడైనా ఎవరైనా దేవాలయాల పైన ప్రార్ధనా స్థలాల పైన మసీదుల పైన దాడులు చేస్తే తప్పనిసరిగా ఖండించాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. గతంలో చంద్రబాబు 13 జిల్లాలు తిరిగి వారి స్థితిగతులు తెలుసుకోవాలని రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం క్రైస్తవ మతాన్ని దూషిస్తున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మొన్నటివరకూ కులాల పేరుతో మతాల పేరుతో నేడు సమాజాన్ని విభజించాలని చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నాను. అన్ని కులాల వారు అన్ని మతాల వారు వేసిన ఓట్లతో టిడిపి అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని గుర్తు చేస్తున్నాను. రామతీర్థం కి గాని దేవాలయాలకు ఎటువంటి సంబంధము క్రిస్టియానిటీ లేకున్నా రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న వైఖరి నచ్చక.. పార్టీని వీడుతున్నట్లు రాజీనామా లేఖలో స్పష్టం చేశారు. దీంతో 37 సంవత్సరాలుగా పార్టీ స్థాపించిన నాటి నుండి ఉన్న వ్యక్తి పార్టీ నుండి వెళ్లిపోవడంతో టీడీపీ పార్టీలో మాత్రమేగాక ఏపీ రాజకీయాల్లో ఎక్స్ ఎమ్మెల్యే ఆంగ్లో-ఇండియన్ రాసిన లెటర్ పెద్ద హాట్ టాపిక్ అయింది.

Related posts

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju